Surendra Recieving Award from ChattisGarh CM

మాటలు లేకుండా విషయం చెప్పగల ప్రతిభావంతుడు

ఒక పేజీలో చెప్పలేని విషయాన్ని ఒక మాటలోనే కార్టూనిస్టులు చెప్పగలరని, కానీ పొదుపరి అయిన సురేంద్ర మాటలు లేకుండా ‘కాప్షన్ లెస్’ కార్టూన్లతో ఎంతో విషయం చెప్పగల ప్రతిభావంతుడని ఛత్తీస్ ఘడ్ సి.ఎం రమణ్ సింగ్ కొనియాడారు. కార్టూన్ మాస పత్రిక ‘కార్టూన్ వాచ్’ ఆధ్వర్యంలో జూన్ 29 వ తేదీన (శనివారం) రాయపూర్ లోని ‘సర్క్యూట్ హౌస్’లో – ‘కార్టూన్ ఫెస్టివల్-2013’లో భాగంగా జరిగిన జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

చదవండి :  యోగి వేమన విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ వివక్ష

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాయిగా నవ్వాలంటే లాఫింగ్ క్లబ్ లో చేరాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ‘కార్టూన్ వాచ్’ సంపాదకుడు త్రయంబక్ శర్మ మాట్లాడుతూ… ‘ఇది ‘కార్టూన్ వాచ్’కు,అదే విధంగా ‘హిందూ’లో సురేంద్రకు 17 వ సంవత్సరం. సురేంద్ర వయసులో చిన్న వాడైనా ‘కార్టూన్ వాచ్’ జీవిత సాఫల్య పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు’ అన్నారు.

సురేంద్ర గీసిన రమణ్ సింగ్ క్యారికేచర్. చిత్రంలో రమణ్ సింగ్ కూడా ఉన్నారు.
సురేంద్ర గీసిన రమణ్ సింగ్ క్యారికేచర్. చిత్రంలో రమణ్ సింగ్ కూడా ఉన్నారు.

కార్టూనిస్ట్ సురేంద్ర మాట్లాడుతూ… సుదూరంలో ఉన్న రాయపూర్ వాసులు ఇచ్చిన గౌరవం మరువలేనిదన్నారు. ఇంత పెద్ద అవార్డుకు అర్హున్ని కాకపోయినా ఒక కార్టూనిస్టు నడుపుతున్న ఒక కార్టూన్ పత్రిక ఇస్తున్న అవార్డు గనుక స్వీకరిస్తున్నానన్నారు.

చదవండి :  ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

అవార్డుకు న్యాయం చేకూరేలా మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పెర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సురేంద్రను జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్ ఘడ్ పర్యాటక శాఖా మంత్రి బ్రజ్మోహన్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: