
రేపటి నుంచి మల్లూరమ్మ జాతర
రాయచోటి: చిన్నమండెం మండల పరిధిలోని మల్లూరమ్మ జాతర గురువారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా మల్లూరంమను భక్తులు పూజిస్తారు. ఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలే మల్లూరమ్మ ఆలయాన్ని రూ.20లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు.
ఈరోజు (బుధవారం) రాత్రి అమ్మవారిని తిమ్మారెడ్డిగారిపల్లె నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయానికి తీసుకొస్తారు. గురువారం ఉదయం అభిషేకాలు, పూజలు ఉంటాయి. సిద్ధల బోనాలు చేయడంతోపాటు వండాడి, మల్లూరు, కొత్తపల్లె గ్రామాల ప్రజలు బోనాలు సమర్పిస్తారు.రాత్రికి చాందినీబండ్ల ప్రదక్షిణలు, చెక్కభజనలు, కోలాటాలు, టీవీ గాయకులతో ఆర్కెస్ట్రా ఉంటాయి.
శుక్రవారం ఉదయం తిరునాళ్ల ఉంటుంది. జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
జిల్లా నలుమూలల నుంచే కాకుండా జిల్లా సరిహద్దు మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. 75 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు.