మైలవరంలో ‘మర్యాద రామన్న’ చిత్రీకరణ
కడప: దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, హీరో సునీల్ కలయికలో తెలుగులో నిర్మితమై విజయం సాధించిన ‘ ‘ సినిమాను కన్నడలోకి రిమేక్ చేస్తున్నారు. దర్శకుడు పత్తి వి.ఎస్.గురుప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం మైలవరం జలాశయంలో నటీనటులపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
ఫైట్ మాస్టర్ థ్రిల్లర్‌మంజు, హీరో కోమల్, హీరోయిన్ నిషా, ప్రముఖ విలన్ వేషధారి ముఖేష్‌రుషి, పలువురు కన్నడ నటులు చిత్రీకరణలో పాల్గొన్నారు. హీరో ఫైట్, జలాశయం నీటిలో నుంచి హీరోయిన్‌ను రక్షించే సన్నివేశం తదితర వాటిని చిత్రీకరించారు.
మరో వారం రోజులపాటు ఈ పరిసర ప్రాంతంలోనే సినీ చిత్రీకరణ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మర్యాదరామన్న సినిమాను కడప జిల్లాలోని పలు ప్రాంతాలు, గండికోట, మైలవరం, అగస్త్యేశ్వరకోన తదితర చోట్ల చిత్రీకరించిన సన్నివేశాలు ప్రజలను ఆకర్షించాయి. ఇందులో భాగంగానే రిమేక్ సినిమా కావడంతో ఇక్కడ చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా మైలవరంలో చిత్రీకరణ బృందం వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూసేందుకు తరలివచ్చారు.
(ఈనాడు)