జిల్లాకు మలి విడతలో మంత్రి పదవి:వాసు

జిల్లాకు మలివిడతలో మంత్రి పదవి వస్తుందని తెదేపా తరపున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాసరెడ్డి (వాసు) ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న విష యమై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

ఆదివారం వేంపల్లెకు వచ్చిన శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ జమ్మలమడుగు ప్రాంతంలో గానీ, కొప్పర్తి పారిశ్రామిక వాడలో కానీ ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆరు నెలల్లో పాలనాపరమైన అనుమతి లభించవచ్చన్నారు.

చదవండి :  వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

ఆర్టీపీపీ 6వ దశలో 800 మెగావాట్ల సామర్థ్యం తో యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అసెంబ్లీ సమావేశాల తర్వా త మఖ్యమంత్రిని కలిసి బాబు జిల్లా పర్యటనకు వచ్చే సమయంలో 6వ యూనిట్ పనులకు శంఖుస్థాపన చేయిస్తామన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రితో త్వరలో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రలోభాలు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం వైసీపీకే చెల్లుతుందన్నారు. ఆ సంస్కృతి టీడీపికి లేదన్నారు. అభివృద్ది ఆకాంక్షించి టీడీపీలోకి వలసలు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

చదవండి :  కక్షతో జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు

వైకాపా నేతలకు అనుమానం ఉండబట్టే క్యాంపులు ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధా నం ఇచ్చారు. విలేకరుల సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మునిరెడ్డి, ఉప సర్పంచ్ ఆర్ఎంఎస్ మున్నీర్, చక్రాయపేట టీడీపీ నాయకులు చంద్రమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మలివిడతలో మంత్రిపదవి గురించి చెప్పిన వాసు మొదటి విడతలో కడప జిల్లాకు ఎందుకు దక్కలేదో అనే విషయం కూడా చెప్పి ఉంటే బాగుండేది.

ఇదీ చదవండి!

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: