Bhanwarlal

బ్రహ్మంగారిమఠంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్‌లాల్ ఈ రోజు (ఆదివారం) కడప జిల్లాలోని వీర బ్రహ్మేంద్రస్వామి సమాధిని దర్శించుకొని, మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు విప్రో, సంతూర్ సౌజన్యంతో వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద 150 జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గులపోటీ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులకు ఓటు విలువ, ఓటు హక్కు వినియోగం గురించి వివరించారు. ఇప్పుడు ఓటు వేయలేకపోతే 5 సంవత్సరాలపాటు ఓటుకు దూరం కావాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియెగించుకోవాలన్నారు. మే చివరిలోగా రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.

చదవండి :  సన్నపురెడ్డి నవల 'కొండపొలం'కు తానా బహుమతి

ఈకార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ ప్రీతిమీనా, మఠం తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: