శనివారం , 21 డిసెంబర్ 2024

కడపలో జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

టోర్నీకి వివిధ రాష్ట్రాల నుండి 500 మంది 

కడప: నగరంలోని  వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 4 నుంచి 10 వరకూ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఏపీ బ్యాడ్మింటన్ రాష్ట్ర కార్యదర్శి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి(ఈవెంట్) పున్నయ్య చౌదరి ప్రకటించారు.

ఆల్ ఇండియా సబ్‌జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహణ విషయమై ఏజేసీ సుదర్శన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పున్నయ్య చౌదరి, వైస్సార్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి రామచంద్రారెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్, జిలానీబాషా, ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి, కోశాధికారి నాగరాజు తదితరులు కలిశారు.

చదవండి :  అవి చిరుతపులి పాదాల గుర్తులే!

అనంతరం జిల్లా పాలనాధికారి కోన శశిధర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి జాతీయస్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహాయ సహకారాలు అందించాలని కోరగా.. అంతా తానై ముందుండి నడిపిస్తానని వారికి హామి ఇచ్చారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి టోర్నమెంట్‌కు భద్రత ఇవ్వాలని కోరారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాకింగ్ టోర్నమెంట్‌లో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు క్వాలిఫైయింగ్ రౌండ్లు, 7 నుంచి 10 వరకు మెయిన్ డ్రా జరుగుతుందన్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 500 మంది క్రీడాకారులు పాల్గొనవచ్చని.. మెయిన్ డ్రాలో 300 మంది క్రీడాకారులు ఆడే అవకాశాలు ఉన్నాయన్నారు.

చదవండి :  జిల్లాలో నెలకు ఒక సారి సాంస్కృతిక కార్యక్రమాలు : కలెక్టర్ అనిల్‌కుమార్

అండర్-13, 15 విభాగాలకు సంబంధించిన బాలబాలికలు టోర్నమెంట్‌లో పాల్గొంటారన్నారు. అండర్-15 విభాగంలో 8 మంది బాలురు, 8 మంది బాలికలకు ఇండోనేషియాలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి!

అరటి పరిశోధనా కేంద్రం

పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

కడప : పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిధ్ధమయింది. ఏపీకార్ల్‌లో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: