బొబ్బిళ్ళ నాగిరెడ్డిని గురించిన జానపదగీతం

బొబ్బిళ్ళ నాగిరెడ్డి గడేకల్లులో వెలసిన భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఇతడు శ్రీమంతుల ఇల్లు దోచి బీదలకు పంచి పెట్టేవాడట. పట్టపగలు నట్ట నడివీధిలో ప్రత్యర్ధులు నాగిరెడ్డిని హతమార్చినారుట. ఆ సంఘటనను జానపదులు ఇలా పాటగా పాడినారు…

చుట్టూ ముట్టూ పల్లెలకెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి
డెబ్బై ఏడు పల్లెలకెల్లా దేవుడమ్మా భీమలింగ

రామ రామా కోదండరామా
భై రామ రామా కోదండరామా

పక్కనున్న పల్లెలకెల్ల పాలెగాడు నాగిరెడ్డి
దిక్కుదిక్కుల పల్లెలకెల్ల దేవుడమ్మ భీమలింగ ||రామ||

చదవండి :  రాయలసీమ జానపదం - తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

మోపిడీ ముకష్టూరులోన రాయి రాయి గరిగే యాళ
అగిడీవాళ్ల యిల్లుదూరి జీటినెంలరు జేసినాడు ||రామ||

బళ్ళారి కచ్చేరికైన పట్టపగలె అగ్గిబెట్టి
బళ్ళారి ఖజాన దోసి బీదబిక్కి కెగజల్లె ||రామ||

బందిమింద రెడ్డి రాంగ పదిమంది చుట్టుముట్రి
చిన్నలూరి మాదిగోడు పండబెట్టి గొంతుగోసె ||రామ||

కొడుకు కొడుకంటాని గోడుగోడునె గౌరమ్మ
బొబ్బిళ్ళ వంశమంత బుడు మారిపోయినాది

రామ రామా కోదండరామా
భై రామ రామా కోదండరామా

జీటినెంలరు = దివీటీల వెలుగులో

పాడినవారు: మాదిగ గంగన్న, మోపిడి, గుత్తి తాలూకా, అనంతపురం జిల్లా

చదవండి :  హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? - రెండో భాగం

ఇదీ చదవండి!

శివశివ మూరితివి

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: