
ఆదివారం ప్రొద్దుటూరుకు బాలయ్య
కడప: లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు నందమూరి బాలకృష్ణ ఆదివారం (28న) ప్రొద్దుటూరుకు రానున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పి.కృష్ణమూర్తి, ఎస్.గోవర్ధన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలకు వేడుకలకు నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.