‘కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారు’

ముఖ్యమంత్రికి రాసిన బహిరంగలేఖలో కడప జిల్లా కాంగ్రెస్

కడప: కడప జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని, జిల్లాపైన తెదేపా కొనసాగిస్తున్న వివక్షను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాసింది. ఈమేరకు ఇందిరాభవన్‌లో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్  అహ్మద్ ఆ లేఖను విడుదల చేశారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా చూస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారని ఆరోపించారు. ‘మీరు ప్రకటించిన పథకాల్లో ఏ ఒక్కటి కడప జిల్లాకు లభించలేదు. కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే వచ్చిందన్న అక్కసుతో జిల్లాపై కక్ష కట్టడం సమంజసం’గా లేదన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఎలాంటి చర్యలు మొదలు కాలేదని, విమానాశ్రాయం ప్రారంభానికి నోచుకోలేదని, ఖనిజ ఆధారిత పరిశ్రమలు,టెక్స్‌టైల్, ఫుడ్‌పార్కు వంటి హామీలు అమలు నోచుకోలేదని పేర్కొన్నారు.

చదవండి :  బాబు గారి కడప జిల్లా పర్యటన షెడ్యూలు..

కనీసం మూతపడిన చెక్కెర కర్మాగారం, పాలకర్మాగారం, ఆల్విన్ కర్మాగారం పునఃప్రారంభించాలని, దీంతో పాటు మంగంపేట ముగ్గురాయికి సంబంధించి పల్వరైజింగ్ మిల్లులకు అనుమతివ్వాలని కోరారు. రిమ్స్‌కు ఎయిమ్స్ హోదా కల్పించాలని అంతేగాకుండా కడపలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి!

emperor of corruption

ఎంపరర్ ఆఫ్ కరప్షన్ ఈ-పుస్తకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పేర వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచురించిన పుస్తకం. ఈ పుస్తకాన్ని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: