పెద్ద దర్గాను దర్శించుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి
కడప : రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బీపీ ఆచార్య బుధవారం రాత్రి కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన పూలచాదర్‌ను స్వయంగా తెచ్చి దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు చేశారు.
దర్గా ప్రతినిధులు వారికి దర్గా చరిత్ర, విశిష్టతల గురించి వివరించారు. గురువారం ఉదయం దేవునికడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవస్థానాన్ని ద ర్శించుకుని ఆ తర్వాత కేంద్ర కారాగారాన్ని సందర్శిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.