తితిదే పాలకమండలి సభ్యుడిగా పుట్టా సుధాకర్

మైదుకూరు: తెదేపా మైదుకూరు నియోజకవర్గ భాద్యులు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.

సుధాకర్ గత ఎన్నికల్లో తెదేపా తరఫున మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సుధాకర్‌యాదవ్ నియామకంపై జిల్లాకు చెందిన పలువురు తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి సుధాకర్ యాదవ్ వియ్యంకుడు. యనమల సిఫార్సు ఆధారంగానే సుధాకర్ తితిదే పాలకమండలిలో చోటు దక్కినట్లు సమాచారం.

చదవండి :  వీరబల్లిలో ఈపొద్దు ఏడుకొండలరాయుడికి పెళ్లి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెదేపా ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి (శృంగవరపుకోట), పిల్లి అనంతలక్ష్మి (కాకినాడ గ్రామీణ), డోల బాలవీరాంజనేయస్వామి (కొండెపి), తెలంగాణకు చెందిన సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), జి. సాయన్న (సికింద్రాబాద్ కంటోన్మెంట్), తెదేపా నేతలు వై.టి.రాజా (తణుకు మాజీ ఎమ్మెల్యే), ఎన్‌టీఆర్ హాయాంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా పనిచేసిన ఎ.వి.రమణ  (ైెహ దరాబాద్), తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వి.కృష్ణమూర్తి, జె.శేఖర్‌రెడ్డి, డి.పి.అనంత్ (బీజేపీ), సంపత్ రవినారాయణ న్ (బిజినెస్), సీఐఐ మహిళా విభాగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుచిత్రా ఎల్లా, ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు,  తిరుపతికి చెందిన పి.హరిప్రసాద్‌ను పాలకమండలి సభ్యులుగా నియమించారు.

చదవండి :  తితిదే నుండి దేవాదాయశాఖకు 'గండి' ఆలయం

వీరితోపాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా, టీటీడీ ఈవో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా జె.ఎస్.వి.ప్రసాద్, దేవాదాయశాఖ కమిషనర్‌గా అనూరాధ, టీటీడీ ఈవోగా సాంబశివరావు వ్యవహరిస్తున్నారు.

తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఈ పాలకమండలికి చైర్మన్ గా నియమితులయ్యారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: