ఆదివారం , 6 అక్టోబర్ 2024
పోతన విగ్రహం వద్ద ప్రముఖులు
పోతన విగ్రహం వద్ద ప్రముఖులు

భాగవత పద్యార్చనకు అనూహ్య స్పందన

ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పోతన సాహిత్యపీఠం మరియు తితిదే ధర్మప్రచారమండలి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం జరిగిన భాగవత పద్యార్చనకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

యోగి  వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్‌ పోటీలను ప్రారంభింపద్యార్చనకు హాజరైన విద్యార్థులను చూసి వారు ఆశ్యర్యచకితులయ్యారు. వీరు తెలుగుభాషా గతవైభవాన్ని గుర్తుకు తెస్తున్నారని వైవీయూ ఉపకులపతి శ్యాంసుందర్ అన్నారు. తెలుగుభాషకు సేవ చేస్తున్న నరసింహులు కృషి అభినందనీయమని అన్నారు. పోతన పద్యాలను చదివి వినిపించారు.

చదవండి :  ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది?

పోతన భాగవతపద్యాలు తెలియని తెలుగువారు ఉండరని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆయన తెలుగువాడు కావడం తెలుగుప్రజల పుణ్యఫలమని పేర్కొన్నారు. విద్యార్థులకు పోతనభాగవత పద్యరచన కార్యక్రమాన్ని నిర్వహించిన విద్వాన్ కట్టా నరసింహులు కృషిని అభినందించారు.

పోతన సాహిత్యపీఠం కార్యనిర్వాహక కార్యదర్శి విద్వాన్ కట్టానరసింహులు మాట్లాడుతూ పోతన భాగవత పద్యార్చనను వేయిమంది విద్యార్థులతో నిర్వహించాలని అనుకున్నాం. రెండువేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. తెలుగుభాషపై విద్యార్థులకు గల అభిమానానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో పోతన, ఉప్పగుండూరు వేంకటకవి, అయ్యలరాజు రామభద్రుడు, వావికొలను సుబ్బారావు, తాళ్లపాక అన్నమాచార్యులు, సాయంవరదాసు, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తదితర ఎందరో మహాకవులు తమ రచనలు చేశారన్నారు. కోదండ రాముని సన్నిధిలో పోతన భాగవత పద్యాలను రాస్తున్న విద్యార్థులు అంతటి మహానుభావుల స్థాయికి చేరుకోవాలని అభిలషించారు. భవిష్యత్తులో తెలుగుభాష అభివృద్ధి కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తామని అన్నారు.

చదవండి :  రాయలసీమ మహాసభ కడప జిల్లా కమిటీ

పోతన సాహిత్యంపై విద్యార్థులకు ఆసక్తి పెంచడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పోతన సాహిత్యపీఠం అధ్యక్షుడు అరవ సుబ్బరామిరెడ్డి అన్నారు. కడపకు చెందిన చిన్నారి శ్రీరామసంతోష్ పాడిన పోతనపద్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు పెద్దబాల శిక్ష, పోతన భాగవతం, భతృహరి సుభాషితాలు అందించారు.

కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంటు కమిషనర్‌ శంకర్‌బాలాజీ, కడప డీఎఫ్‌ఓ నాగరాజు, సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు పిచ్చయ్యచౌదరితో పాటు పలువురు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

చిన్న క్షేత్రాలనూ

చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద …

ఒక వ్యాఖ్య

  1. ఆర్యా నమస్కారములు,
    చాలా అద్భుతమైన వార్త అందించారు ధన్యవాదాలు.
    ఇలా భాగవత పద్యార్చన చేయటం చాలా గొప్పవిషయం. జాతికి బహుళ ప్రయోజనకరమైనది. ఈ అనూహ్య స్పందన ముదావహం.
    దీనిని నిర్వహించినవారికి, ఆదరించిన వారికి, ప్రోత్యహించినవారికి అభినందనలు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: