సోమవారం , 16 సెప్టెంబర్ 2024

రాజధానికి నీటిని తరిలించేందుకే ‘పట్టిసీమ’ : బివిరాఘవులు

సీమ కోసం పోరాడేందుకు అఖిలపక్షం, ప్రజా సంఘాలు కలసి రావాలి

జాతీయ జెండా సాక్షిగా చంద్రబాబు విఫలం

కర్నూలు: రాయలసీమ అభివృద్ధికి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. బుధవారం కర్నూలులోని సి.క్యాంప్ సెంటర్‌లోని లలిత కళాసమితిలో ‘రాయలసీమ అభివృద్ధి- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కొత్త రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా సాక్షిగా రాయలసీమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు విఫలం చెందారన్నారు.

చదవండి :  'సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాల' - జస్టిస్ లక్ష్మణరెడ్డి

పట్టిసీమ నీటిని రాజధాని ప్రాంతాలకు తరిలించేందుకే రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేత వెంకయ్య నాయుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన బడ్జెట్‌లో అందుకు తగ్గట్లు నిధులు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. కేంద్రం వెనుకబడిన ప్రాంతాల పేరుతో జిల్లాకు కేంద్రం ఇచ్చిన రూ.50కోట్ల నిధులు ఏ మూలకు ఖర్చు చేసుకోవాలని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యక హోదాను తెప్పించడంలో విఫలమయ్యారన్నారు. పరిశ్రమలను రాజధాని చుట్టూ నిర్మించకుండా వెనుకబడిన జిల్లాల్లో నిర్మిస్తే ఆయా ప్రాంతాలు అభివృద్ధిలోకి వస్తాయన్నారు.

చదవండి :  హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? - రెండో భాగం

అనంతరం మాజీ ఎమ్మెల్యే, కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఏ.గఫూర్ మాట్లాడుతూ రాజధాని పేరుతో లాక్కునే భూముల్ని సింగపూర్ సంస్థలకు అప్పగించేందుకు ఒప్పందం జరిగిందన్నారు. 33వేల ఎకరాలు అవసరం లేదని తమ పార్టీ చెబుతున్నా పట్టించుకోవకపోవడం విచారకరమన్నారు.

సదస్సులో రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, కమిటీ సభ్యులు రామకృష్ణ, కె.వి.సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: