నేటి రాజకీయాలపై గ్రామీణ మహిళల జానపద చెణుకులు!

    నేటి రాజకీయాలపై గ్రామీణ మహిళల జానపద చెణుకులు!

    మైదుకూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సెగలు ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో సెగమంటలు రేపుతుంటే మరో పక్క సాంస్కృతిక స్పృహను రగుల్కొలుపుతోంది. రాయలసీమ ప్రాంతం సాంస్కృతిక వైవిధ్యానికి ఆలవాలమైన ప్రాంతం. ఇక్కడి ప్రజల మాటల్లో నిజాయితీ, నిక్కచ్చితనం ఉట్టిపడుతూ ఉంటుంది.ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు ఖరాఖండీగా చెప్పడం ఈ ప్రాంత ప్రజల మనస్తత్వం. మాటైనా , పాటైనా ఘాటుగా స్పందించడానికి ఏమాత్రం వెనుకాడరు ఈ సీమ పల్లెప్రజలు..!

    గుడిసెనపల్లి నాగమ్మ బృందం
    గుడిసెనపల్లి నాగమ్మ బృందం

    సమైక్యాంధ్ర ఉద్యమం.. సందర్భంగా ప్రజల్లోనుంచి అనేకమంది కళాకారులు ఉద్యమ వేదికలపైకి స్వచ్ఛందంగా తరలివచ్చి తమకళాకౌశలాలను ప్రదర్శిస్తున్నారు.వై.ఎస్.ఆర్.కడప జిల్లా మైదుకూరులో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శుక్రవారం గ్రామీణ మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి జానపగేయ పద్ధతిలో నేటి రాజకీయాలపై పాటలను కైకట్టి విసిరిన చెణుకులు  అందర్నీ ఆకట్టుకున్నాయి.

    చదవండి :  సీరల్ కావలెనా - జానపద గీతం

    మైదుకూరు మండలం మిట్టమానిపల్లెకు చెందిన దళిత మహిళ గుడిసెనపల్లి నాగమ్మ రాష్ట్ర విభజన నిర్ణయం వెనుక సొనియాగాంధి పాత్రను ఎండగడుతూ , నేటినాయకుల చేతగానితనంవల్ల నిరుపేదలు, పల్లెప్రజలు పడుతున్న అష్టకష్టాలను జానపద శైలిలో పాటగా పాడి వినిపించారు. గురువారం కూడా తాము పాటలు పాడామని ఈ మహిళలు తెలిపారు. గాయపడిన గుండేల్లోంచి వచ్చిన ఈ పాటల ముందర ఖరీదు చెల్లించి వినేపాటలు, చూసే విన్యాసాలు  దిగదుడుపే మరి..!

      సంపాదకుడు

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *