కసువు చిమ్మే నల్లనాగీ… జానపదగీతం

    భార్యాభర్తల తైలవర్ణ చిత్రం

    కసువు చిమ్మే నల్లనాగీ… జానపదగీతం

    సంసారమనే  శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. దానిని సరిచేయటానికి ఒక మనిషంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణ పాట రూపంలో…

    వర్గం: జట్టిజాం పాట

    పాడటానికి అనువైన రాగం: హిందుస్తాన్ తోడి రాగస్వరాలు (ఏకతాళం)

    భర్త: కసువు చిమ్మే నల్లనాగీ                 గురిగింజ గుమ్మడి
    భార్య: సిమ్మను పోరా సిమ్ముకో పోరా     గురిగింజ గుమ్మడి
    భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ         గురిగింజ గుమ్మడి
    భార్య: అమ్మా సూడె తంతాడంట            గురిగింజ గుమ్మడి
    అత్త: ఎందుకు పిల్లగాడ తంతావంట        గురిగింజ గుమ్మడి
    భర్త: సెప్పిన పని సేయదత్తా                   గురిగింజ గుమ్మడి
    అత్త: సెప్పిన పని సేస్కో బిడ్డా                 గురిగింజ గుమ్మడి

    చదవండి :  కల్లు గుడిసెల కాడ - జానపదగీతం

    భర్త: వడ్లు దంచే నల్లనాగీ                       గురిగింజ గుమ్మడి
    భార్య: దంచను పోరా దంచుకో పోరా        గురిగింజ గుమ్మడి
    భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ         గురిగింజ గుమ్మడి
    భార్య: అమ్మా సూడె తంతాడంట            గురిగింజ గుమ్మడి
    అత్త: ఎందుకు పిల్లగాడ తంతావంట        గురిగింజ గుమ్మడి
    భర్త: సెప్పిన పని సేయదత్తా                   గురిగింజ గుమ్మడి
    అత్త: సెప్పిన పని సేస్కో బిడ్డా                 గురిగింజ గుమ్మడి

    భర్త: కూడూ వార్సి కూరాకు వండే నల్లనాగీ గురిగింజ గుమ్మడి
    భార్య: వండను పోరా వండుకో పోరా        గురిగింజ గుమ్మడి
    భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ         గురిగింజ గుమ్మడి
    భార్య: అమ్మా సూడె తంతాడంట            గురిగింజ గుమ్మడి
    అత్త: ఎందుకు పిల్లగాడ తంతావంట        గురిగింజ గుమ్మడి
    భర్త: సెప్పిన పని సేయదత్తా                   గురిగింజ గుమ్మడి
    అత్త: సెప్పిన పని సేస్కో బిడ్డా                 గురిగింజ గుమ్మడి

    చదవండి :  చెక్కభజన

    భర్త: నిద్దర మకాన మజ్జిగ సిలికే నల్లనాగీ గురిగింజ గుమ్మడి
    భార్య: సిలకను పోరా సిలుక్కో పోరా       గురిగింజ గుమ్మడి
    భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ        గురిగింజ గుమ్మడి
    భార్య: అమ్మా సూడె తంతాడంట           గురిగింజ గుమ్మడి
    అత్త: ఎందుకు పిల్లగాడ తంతావంట       గురిగింజ గుమ్మడి
    భర్త: సెప్పిన పని సేయదత్తా                  గురిగింజ గుమ్మడి
    అత్త: సెప్పిన పని సేస్కో బిడ్డా                గురిగింజ గుమ్మడి

    పాటను సేకరించినవారు: కీ.శే.కలిమిశెట్టి మునెయ్య, దొమ్మరనంద్యాల, జమ్మలమడుగు తాలూకా, కడప జిల్లా

    చదవండి :  బండీరా..పొగబండీరా... జానపదగీతం

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *