భగవదంకితబుద్ధులను ఏ దుష్టశక్తులూ నిలుపలేవు. భగవంతుని చేరడానికి పేర్కొన్న నవవిధ భక్తి మార్గాలలో వైరాన్ని ఆశ్రయించిన వారు శిశుపాల హిరణ్యకసిపాదులు. వైకుంఠవాసుడు ఆ దుష్టశక్తులను సంహరించి తన సాధుసంరక్షకత్వాన్ని చాటినాడు. అన్నమయ్య తన సంకీర్తన తపస్సును భంగపరిచే దుష్ట రాజకీయ శక్తులను నిర్మూలించమని వేంకటగిరి నృశింహుని ఇలా వేడుకుంటున్నాడు….
సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…
నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ
సరుగ నా(నా) శత్రుల సంహరించవే
బావతిట్లకు శిశుపాలుని జంపిన
యేవ కోపకాడవు నేడెందు వోతివి
నీవాడనని నన్ను నిందించే శత్రువును
చావగొట్టి వాని నిట్టే సంహరించవే
దాసుని భంగించేటి తరి కస్యపు జంపిన
యీసుకోపగాడ విపు డెందువోతివి
మేసుల నీలాంఛనాలు మించి నన్ను దూషించే
సాసించి శత్రువును సంహరింపవే
కల్లలాడి గూబయిల్లు గైకొన్న గద్ద జంపిన
యెల్లగాగ కోపకాడ వెందువోతివి
యిల్లిదె శ్రీవేంకటేశ యీ నీ మీది పాటలు
జల్లన దూషించు శత్రు సంహరింపవే
సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…