డిఎల్ మైదుకూరులో పోటీ చేయరా?

    డి ఎల్ రవీంద్రా రెడ్డి

    డిఎల్ మైదుకూరులో పోటీ చేయరా?

    కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని డిఎల్ తన అనుచరులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నిర్వహిస్తానని వివరించినట్లు తెలుస్తోంది.

    ఇంతకాలం పరస్పర సహకారంతో పయనించాం. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. మీ సహకారానికి కృతజ్ఞతలు. రాజకీయంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ మంగళవారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం.

    ఖాజీపేటలో ఈనెల 5న కార్యకర్తల సమావేశం పెట్టిన ఆయన అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఖాజీపేటకు చేరుకోవడంతో పలువురు అనుచరులు వెళ్లి కలిశారు. ఇకపై మైదుకూరులో పోటీ చేసేది లేదంటూ తేల్చి చెప్పినట్లు తెలిసింది. మీరంతా మీ రాజకీయ ఉన్నతికి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపండని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

    చదవండి :  కడప పార్లమెంటులో ఎవరికెన్ని ఓట్లు

    ఈ నేపధ్యంలో డిఎల్ అనుచరులు ఎవరి రాజకీయదారులను వారు ఎంచుకుంటున్నారు. దువ్వూరు మండలానికి చెందిన మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు గుడిపాడు బాబు, మాజీ సర్పంచ్‌లు వెంకటేశ్వరరెడ్డి (భీమునిపాడు), రామచంద్రారెడ్డి (జొన్నవరం), రామసుబ్బారెడ్డిలతో బాటు మరో 10 పంచాయతీల్లో కాంగ్రెస్ నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.

    1978లో ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 335 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు.

    చదవండి :  పాలకవర్గాలు ఏర్పడినాయి!

    ఆ తర్వాత 1983, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిల మంత్రివర్గంలో రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్ జిల్లా గ్రూపు రాజకీయాల్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గీయుడిగా డీఎల్ రవీంద్రారెడ్డికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.

    ఎత్తు పల్లాలు…

    1978 ఎన్నికల్లో 335 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన డీఎల్, 1994 ఎన్నికల్లో ఓటమి అంచులకు వెళ్లిన ఆయన స్వల్పంగా 28 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అత్యధికంగా 1989లో 33,358 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2011 మే8న కడప పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన డిపాజిట్ కోల్పోయి ఓటమి పాలయ్యారు.

    చదవండి :  నేను మాట్లాడితే తప్పా?

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *