
ప్రసాద్ రెడ్డి – ప్రొద్దుటూరు
టీకొట్ల వద్ద ప్రచారం చేయిస్తున్నారా?
ప్రొద్దుటూరు: పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళుతున్నారని, ఇందులో భాగంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రొద్దుటూరులో పోటీ చేస్తారని, ఇందుకుగాను రూ.36కోట్లకు ఒప్పందం కుదిరిందని, టీ దుకాణాల వద్ద తెదేపా నేతలు ప్రచారం చేయిస్తున్నారన్నారని వైకపా శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాదరెడ్డి వాపోయారు. ఇందుకు కొనసాగింపుగానే ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు.
ఇదే మాదిరిగా జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గాలలో ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. అలాగే తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబంపై తనకు అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, జగన్‌మోహన్‌రెడ్డి అడిగితే ఎమ్మెల్యే పదవే కాదు తన ప్రాణాలను అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చె ప్పారు. ఈ జీవితం ఉన్నంత వరకు తాను వైఎస్ కుటుంబంతోనే ఉంటానని తెలిపారు. ఇలాంటి విష ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దని సూచించారు.
కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం
Wednesday, July 24, 2019