జిల్లా వాసికి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో రెండవ ర్యాంకు

కడప: జిల్లాలోని రాజంపేట మండలం గాలివారిపల్లెకు చెందిన వంకన కనక శైలేష్‌రెడ్డి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించారు. ఈ నెల 1వ తేదీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఫలితాలు విడుదల చేసింది.
2010 జూన్‌లో రాసిన ఈ పరీక్షా పలితాలు జనవరిలో వచ్చాయి. అనంతరం ఫిబ్రవరి, మార్చిలో ఇంటర్యూలు నిర్వహించారు. చివరి ఫలితాలలో శైలేష్‌రెడ్డికి రెండవ ర్యాంకు దక్కింది. శైలేష్‌రెడ్డి తిరుపతిలోని గౌతమ్ స్కూల్‌లో పదవ తరగతి, క్యాన్‌లో ఇంటర్, వరంగల్ ఎన్‌ఐటీలో బీటెక్ చదివాడు. ఎన్‌ఐటీలో 2006 గోల్డ్‌మెడల్ సాధించారు.
శైలేష్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని జలమండలిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. శైలేష్‌రెడ్డి జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించి రాజంపేటతోపాటు రాష్ట్రానికీ మంచి పేరు తెచ్చాడని స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రశంసించారు.
రైల్వేలోసేవలందించాలని ఉంది : శైలేష్‌రెడ్డి
రైల్వేలో సేవలందించాలనేది తన అభిమతమని శైలేష్‌రెడ్డి చెప్పారు. ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యంతప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రెండవ ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తానీ విజయం సాధించానని చెప్పారు.