
రీపోలింగ్ జరగనున్న దేవగుడిలోని బూత్ ఇదే!
మంగళవారం దేవగుడిలో రీపోలింగ్
మే 7న జరిగిన పోలింగ్ సందర్భంగా ఘర్షణ జరిగిన దేవగుడిలో ఈనెల 13వ తేదీన (వచ్చే మంగళవారం) రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రీ-పోలింగ్ నిర్వహించనున్నారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు.
ఈ నివేదికను శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. దీంతో రీపోలింగ్ అవసరమయ్యే కేంద్రాలను శనివారం ఖరారు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
జమ్మలమడుగులోని 80, 81, 82 (ఈ మూడు కేంద్రాలు దేవగుడి గ్రామానికి చెందినవే) పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది.