జమ్మలమడుగు పురపాలిక ఎన్నిక రెండో రోజూ ఆగింది!

    జమ్మలమడుగు పురపాలిక ఎన్నిక రెండో రోజూ ఆగింది!

    జమ్మలమడుగు: శుక్రవారం రాత్రి చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతోందనుకున్న తరుణంలో ఆర్డీఓ రఘునాథరెడ్డి కర్ఛీఫ్‌తో ముఖం తుడుచుకుంటూ ప్రస్తుతం రక్తపోటు కారణంగా ఆరోగ్యం సహకరించడం లేదని ఎన్నికలు నిర్వహించలేనని చేతులెత్తేశారుశారు.  రెండు గంటలు కథ నడించారు. రాత్రి 11 గంటల వరకు ఎన్నిక విషయంలో అధికారులు ఎటూ తేల్చలేదు.

    ఆలోగా శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని చైర్మన్ ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆర్డీవోకు లేఖ పంపారు. అంతవరకూ అనారోగ్యం నటించిన ఆర్డీవో ఆలేఖను హుషారుగా చదివి సభ్యులకు వినిపించినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే ఎన్నికను నిర్వహిస్తామని రాత్రి 11గంటల తరువాత ఆర్డీఓ ప్రకటించి వెళ్లిపోయారు. ఆ రకంగా తెదేపా వాళ్ళు రెండురోజులుగా చేస్తున్న డిమాండ్ నెరవేరినట్లే.

    చదవండి :  27న కడపకు చంద్రబాబు

    అధికారుల వైఖరిని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన విస్మయం ప్రకటించినట్లు సమాచారం.

    ఎన్నికను  వీలైనంత తొందరగా పూర్తి చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు ఇలా జాప్యం చేస్తున్నారేమిటో? ఇంతా జరుగుతుంటే ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దకపోవడం కొసమెరుపు. ఇంతకీ జానీ ఎప్పుడొస్తాడో? ఏమి చేస్తాడో?

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *