పులివెందులను గబ్బుగా చూపిన ‘జంపు జిలాని’

    పులివెందులను గబ్బుగా చూపిన ‘జంపు జిలాని’

    పులివెందులలో చోటా మోటా నాయకులు ఇళ్ళ ముందు చూడడానికి భయంకరంగా ఉండే మనుషులను పెట్టుకుని బాంబులు చుట్టిస్తూ.. కత్తులు పట్టుకుని తిరుగుతుంటారట – అంతే కాదండోయ్ పులివెందులలో కేవలం ఫ్యాక్షనిస్టులు, నేరస్తులు, రౌడీలు మాత్రమే ఉంటారుట – ఇదీ ‘జంపు జిలానీ’ అనే పేరుతో ఇటీవల విడుదలయిన ఒక సినిమాలో పైత్యం శ్రుతిమించి చూపించిన సన్నివేశం.

    అంతేనా సినిమాలో పలుచోట్ల పులివెందుల అనగానే అయ్యా బాబోయ్ అది ఫ్యాక్షనిస్టుల ఊరు నేను రాను అంటూ కథానాయకుడితో సంభాషణలు సైతం చెప్పిస్తే. ఒక ప్రాంతాన్ని, అక్కడి వ్యక్తులను కించపరుస్తూ సినిమాలో సన్నివేశాలను చిత్రీకరిస్తే ఘనత వహించిన సెన్సార్ బోర్డు ఏమి చేసినట్టు?

    చదవండి :  బాబును గద్దె దింపాలనే దుర్బుధ్ధితోనే...

    ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొంతమంది రాజకీయ నాయకులు ‘పులివెందుల నేరస్తుల అడ్డాగా మారింది’ అని విమర్శిస్తే … ఇప్పుడు సినిమా వాళ్ళు వెకిలి హాస్యం పండించడానికి పులివెందులను, అక్కడి ప్రజలను కించపరుస్తూ సినిమాలు తీస్తుండడం దారుణం.

    ఇదే సినిమాలో ప్రధమార్ధం నిడదవోలు అనే ఊరిలో జరిగినట్లు చూపించారు. నిదదవోలును గురించి చక్కగా చూపి పులివెందుల దగ్గరికొచ్చేసరికి వెకిలిగా చూపించారు. ఇది పులివెందుల వాసుల మనోభావాలను దెబ్బతీయడమే!

    ఇటువంటి ప్రచారాలను జిల్లావాసులు అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    చదవండి :  గండికోట ను సందర్శించిన సి.ఎం. చంద్రబాబు

    ‘జంపు జిలాని’ సినిమాను కడప జిల్లా వాసులు బహిష్కరించాలని కడప.ఇన్ఫో కోరుతోంది.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *