
చిరుతపులిని తగులబెట్టిన రైతు
మైదుకూరు: మండలంలోని మిట్టమానుపల్లెకు చెందిన రైతు మూలే రామసుబ్బారెడ్డి తన పంటపొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకొనే నేపధ్యంలో తన తోటకు విద్యుత్ వైర్లతో కంచె వేశాడని, రాత్రివేళ చిరుత వచ్చి విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందిందని, చిరుత మృతిచెందడంతో రైతు రామసుబ్బారెడ్డి శక్రవారం స్టార్టర్ ఆయిల్ చిరుతపై పోసి నిప్పుపెట్టి ఆనవాలు లేకుండా కాల్చివేయాలనే ప్రయత్నం చేశాడని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఈ నేపధ్యంలో దర్యాప్తు చేసి శనివారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వనిపెంట రేంజ్ అధికారి వివేకానంద తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం రైతును అరెస్టు చేసి కోర్టులో హాజరుపెట్టినట్లు ఆయన తెలిపారు.