‘చెన్నూరు సహకార చక్కెర కర్మాగారం తెరిపించండి’

కడప: జిల్లాలోని చెన్నూరు సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని వైకాపా ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం శాసనసభలో కోరారు. కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో 13 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీపైనే ఆధారపడి ఉన్నారన్నారు. చక్కెర కర్మాగారం ఉద్యోగులకు మూడేళ్లుగా జీతాలు కూడా చెల్లించటం లేదని, వారు దుర్భర పరిస్థితిలో ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పటికైనా తక్షణం రైతులను ఆదుకోవాలంటూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

చదవండి :  26,27,28 తేదిలలో తపాల బిళ్ళలు, నాణేల ప్రదర్శన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: