5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఎప్రిల్ 2 చివరి తేదీ

కడప జిల్లాలో నడపబడుతున్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో(ఇంగ్లీషు మీడియం కొరకు)  చేరడానికి  నిర్వహించే ప్రవేశపరీక్షకు ఆం.ప్ర గురుకుల విద్యాలయాల సంస్థ  విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కడప జిల్లా విద్యార్థులు (బాల బాలికలు) క్రింది పాఠశాలలో ప్రవేశం పొందేందుకు అర్హులు:

జనరల్ కేటగిరీ విద్యార్థులు:

ఆం.ప్ర ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల – ముక్కావారిపల్లె

ఆం.ప్ర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల – మైలవరం

ఆం.ప్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సేల్లెన్స్) – కొడిగెనహళ్లి

చదవండి :  నేటి రాజకీయాలపై గ్రామీణ మహిళల జానపద చెణుకులు!

మైనారిటీ విద్యార్థులు:

ఆం.ప్ర ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల – కడప

ఆం.ప్ర ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల – అనంతపురం

ఆం.ప్ర ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల – నల్గొండ

ఆం.ప్ర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల – వేంపల్లి

ఆం.ప్ర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల – వాల్మీకిపురం (చిత్తూరు జిల్లా)

ఆం.ప్ర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల – చిత్తూరు

ఆం.ప్ర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల – ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా)

అర్హత:

2013-14 విద్యా సంవత్సరంలో ప్రభత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదేని పాఠశాలలో నిరవధికంగా 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల వయస్సు 9 నుండి 11 సంవత్సరాల మధ్యలో ఉండాలి.  ఎస్.సి లేదా ఎస్.టి విద్యార్థులైతే రెండు సంవత్సరాల అదనపు మినహాయింపు ఉంటుంది. అంటే 13 సం||ల లోపు ఎస్.సి లేదా ఎస్.టి విద్యార్థులు ఈ ప్రవేశపరీక్ష రాసేందుకు అర్హులు.

చదవండి :  డబ్బులూ, అనుమతులూ ఇవ్వకుండా నీళ్లెలా తేగలరు?

విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరాదాయం అరవై వేల రూపాయలకు మించరాదు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ ఆదాయపరిమితి నిబందన నుండి మినహాయింపు ఉంటుంది.

ఆఖరు తేదీ:

దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 2 ఆఖరు తేదీ.  

పరీఖ తేదీ – పరీక్షా  కేంద్రాలు:

దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 27 వ తేదీన కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో జరిగే ప్రవేశపరీక్ష రాయవలసి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

చదవండి :  26,27,28 తేదిలలో తపాల బిళ్ళలు, నాణేల ప్రదర్శన

ఇదీ చదవండి!

Round Table

అది మూర్ఖత్వం

రాష్ట్ర విభజన వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో అనేక వివాదాలు ఏర్పడతాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే ఏకైక పరిష్కారమని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: