
బాబును గద్దె దింపాలనే దుర్బుధ్ధితోనే…
పులివెందుల: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం తెలుగు తమ్ముళ్లు జగన్ దీక్షకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టడం వింతగా కనిపిస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ నిరసన దీక్షకు దిగడం సిగ్గుచేటంటూ తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినారు.
కడప జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో గళమెత్తావా? ఇప్పుడెందుకు నిరసన దీక్షలు చేయబోతున్నావు? అంటూ రామ్‌గోపాల్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌పై ధ్వజమెత్తారు. ఏదో విధంగా అల్లోకల్లోలం చేసి.. చంద్రబాబును గద్దె దింపి తాను ముఖ్యమంత్రి కావాలనే దుర్బుధ్ధితోనే ఇలా నిరసన దీక్షలంటూ కుట్రలు పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్రలో ఎవరూ చేయని రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రైతులు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడని రామ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి బాగా పని చేస్తుంటే ప్రతిపక్ష నేత దీక్షను తెదేపా నేతలు ఎందుకు ఆక్షేపిస్తున్నారో? అయినా ఎవరైనా ఉత్తినే దీక్ష చేస్తే ప్రజలు ఆదరిస్తారా!