గడపరాయ చాలదా యింకా (సంకీర్తన) – తాళ్ళపాక పెదతిరుమలాచార్య

    గడపరాయ చాలదా యింకా (సంకీర్తన) – తాళ్ళపాక పెదతిరుమలాచార్య

    కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు (గడపరాయ) చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. నాయికా నాయకుల సరసములు ప్రొద్దుపోవు వరకు సాగినవి.

    రాగము: ఆహిరి
    రేకు: 49-5
    సంపుటము: 17-294

    ॥పల్లవి॥ జరపులనే పొద్దు వోయ చాలదా యింక
    సరుఁస గడపరాయ చాలదా యింకా

    ॥చ1॥ కేరి కేరి చెలి నీవు కిలకిల నవ్వించఁగ
    సారెకుఁ జెమట జారె చాలదా యింక
    గారవించి యాకెచేతఁ గతలు చెప్పించుకోఁగా
    సారవు బెదవు లెండె చాలదా యింకా

    చదవండి :  సొంపుల నీ వదనపు సోమశిల కనుమ - అన్నమయ్య సంకీర్తన

    ॥చ2॥ సాజపుఁ బచ్చిమాటలు సతితోడ నాడఁ గాను
    జాజుకొనఁ బులకించె చాలదా యింకా
    తేజమునఁ బానుపుపై తెగి సరసమాడఁగా
    జాజుల కొప్పెల్లా వీడె చాలదా యింకా

    ॥చ3॥ నిరతిఁ జన్నులపై కిన్నెర వాయింపించఁగాను
    సరి నిట్టూర్పులు రేఁగె చాలదా యింకా
    పరవశమై కూడగాఁ భామను శ్రీవేంకటేశ
    సరుగఁ బంతము చెల్లె చాలదా యింక

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *