
‘గండికోట’కు నీల్లేయి సోమీ?
ఫిబ్రవరి 27న ‘గండికోట’ జలాశయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గారు కాలవ గట్ల మీద నిద్ర పోయైనా జులై నాటికి అక్కడ 35 టి.ఎం.సిల నీటిని నింపుతానని బహిరంగ సభలో వాక్రుచ్చారు (ఆధారం: https://kadapa.info/గండికోట-బాబు/). బాబు గారు చెప్పిన జులై పోయింది సెప్టెంబరు కూడా వచ్చింది.
‘గండికోట’కు నీళ్ళ జాడ లేదు. ముప్పై టిఎంసిలు కాదు మూడు టిఎంసిలు కూడా ‘గండికోట’కు రాలేదు. పెండింగ్ పనుల పూర్తికి డబ్బులు ఇవ్వకుండా కాలవ గట్లపైన నిద్రపోతానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మొన్నా మధ్య కాలవ గట్ల పైన కాకుండా కడప విమానాశ్రయంలో అత్యంత వేగవంతమైన సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి గారు ‘గండికోట’ నీళ్ళ గురించి బయటికి ఏమీ చెప్పినట్లు లేరు.
‘గండికోట’లో నీళ్ళు చేరే దాకా గడ్డం తీయనని శపథం చేసిన సతీష్ రెడ్డి గారి పరిస్తితి ఏమిటో? కడప జిల్లా తెదేపా నేతలైనా ఈ విషయం బాబు గారికి గుర్తు చేస్తారా?
ఈ మధ్య కొంతమంది కడప జిల్లా తెలుగు నేతలు సరదాగా…’పట్టిసీమ’ను జాతికి అంకితం చేసినట్లు ‘గండికోట’లో 35 టిఎంసిల నీళ్ళు నింపినట్లు ఫంక్షన్ చేస్తే సతీష్ అన్న గడ్డం తీయించుకుంటారు కదా! అని జోకులేస్తున్నారట.
ఇంతకీ మా ‘గండికోట’కు 35 టిఎంసిలు ఎప్పుడిస్తారు సోమీ?
చంద్రన్నకు ప్రేమతో …
Saturday, March 3, 2018