ఈపొద్దు రైల్వేకోడూరుకు ముఖ్యమంత్రి

    ఈపొద్దు రైల్వేకోడూరుకు ముఖ్యమంత్రి

    కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ జిల్లాకు రావడం ఇదే ప్రథమం. అందుకు సంబంధించి బాబు తన పర్యటనలో అధికారికంగా పలు కార్యక్రమాలకు బాబు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

    పర్యటన సాగేదిలా….

    చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి బయలుదేరి 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 12.00 గంటలకు కోడూరు సమీపంలోని ఓబనపల్లెకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యకక్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్త్రీ శక్తి భవనానికి కూడా ప్రారంభించనున్నారు. 4.40గంటలకు హెలికాఫ్టర్‌లో రేణిగుంటకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదు వెళతారు.

    చదవండి :  వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

    ఓబనపల్లెలో…

    రైల్వేకోడూరు పరిధిలోని ఓబనపల్లె జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. శనివారం ముందుగా ఉదయం 12 గంటల ప్రాంతంలో ఓబనపల్లెలో మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

    అనంతరం బడిపిలుస్తోంది కార్యక్రమంలో కూడా బాబు పాల్గొననున్నారు. అలాగే పశు వైద్య శిబిరం, హెల్త్ క్యాంపు, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను పరిశీలించనున్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించిన స్త్రీ శక్తి భవనంతోపాటు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులతో బాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.

    చదవండి :  పులివెందుల గురించి చంద్రబాబు అవాకులు చెవాకులు

    నలుగురు అదనపు ఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 22 మంది సీఐలు

    రైల్వేకోడూరుకు ముఖ్యమంత్రి వస్తున్న సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నలుగురు అదనపు ఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 22 మంది సీఐలు, 62 మంది ఎస్‌ఐలు, 99 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 508 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 55 మంది మహిళా కానిస్టేబుళ్లు, 64 మంది హోం గార్డులతోపాటు తొమ్మిది సెక్షన్ల స్పెషల్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు.

    చదవండి :  ఈ పొద్దు మాయిటాల జమ్మలమడుగుకు బాబు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *