Tags :railway kodur

    ప్రత్యేక వార్తలు రాజకీయాలు

    ఈపొద్దు రైల్వేకోడూరుకు ముఖ్యమంత్రి

    కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ జిల్లాకు రావడం ఇదే ప్రథమం. అందుకు సంబంధించి బాబు తన పర్యటనలో అధికారికంగా పలు కార్యక్రమాలకు బాబు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పర్యటన సాగేదిలా…. చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి బయలుదేరి 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 12.00 గంటలకు కోడూరు సమీపంలోని ఓబనపల్లెకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యకక్రమాల్లో పాల్గొంటారు. […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    అవి చిరుతపులి పాదాల గుర్తులే!

    రైల్వేకోడూరు మండల పరిధిలోని ఆర్.రాచపల్లె తోటలలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి తిరగడంతో స్థానికులు బెంబేలెత్తారు.  మూడు రోజులుగా ఈ ప్రాంతంలోని అరటితోటల్లో చిరుతపులి తిరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో నీటితడులు కట్టిన తర్వాత ఏదో అడవిజంతువు తిరుగుతుందని పాదాల గుర్తులు చూసి అనుకున్నామని , అయితే శుక్రవారం వేకువజామున తమ తోటలో నీరు తడి కట్టేందుకు వెళ్లానని భాస్కర్‌రాజు అనే రైతు పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తన తోటలో నిలబడి ఉన్న చిరుతపులిని చూసి భయపడి […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    రైల్వేకోడూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడి నుండి మొత్తం పదహైదు మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన శనివారం సాయంత్రం వరకు రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు […]పూర్తి వివరాలు ...

    పర్యాటకం

    తలకోనకు మూడురెట్లున్న గుంజన జలపాతం

    నూరు ఏనుగు తొండాలతో కుమ్మరించినట్టు జలధార పైనుంచి భూమిలోకి దిగగోట్టినట్లు పడుతుంటుంది. అక్కడున్న ఒళ్ళు గగుర్పొడిచే గుండం, అర్ధముఖాకృతి నుంచి చిప్పిల్లే నీటి తుంపరలు పారవశ్యం కలిగిస్తున్నట్లుంది. ఓ పావురాల గుంపు పదేపదే అక్కడ చక్కర్లు కొడుతోంది. పాకుడు పట్టిన రాళ్ళ మధ్య పొడుచుకు వచ్చిన ఫెర్న్ మొక్కలు పాము పడగలల్లే... పూర్తి వివరాలు ...

    పర్యాటకం

    గుండాల కోన

    పరుచుకున్న పచ్చదనం.. పక్షుల కిలకిలా రావాలు.. గలగలపారే సెలయేరు.. నింగికి నిచ్చెన వేసినట్లున్న కొండలు.. కనువిందు చేసే కమనీయ దృశ్యాలు.. మేను పులకరించే ప్రకృతి అందాలు.. ఈ అందాలను తనివితీరా చూసి తరించాలంటే గుండాల కోనను దర్శించాల్సిందే. పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో కొలువు దీరిన నీలకంఠేశ్వరుడు ఈ కోనకు ప్రత్యేక ఆకర్షణ. ఓబులవారిపల్లి మండలం వై.కోటనుంచి 15 కిలోమీటర్లు, రైల్వేకోడూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శేషాచల అడవుల్లో గుండాల కోన క్షేత్రం ఉంది. […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    బారులు తీరిన ఓటర్లు – భారీ పోలింగ్ నమోదు

    స్వల్ప సంఘటనలు మినహా వైఎస్సార్ జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంల ఏర్పాటులో తలమునకలయ్యారు. ఉదయం 8 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం ఐదు గంటల వరకు ఓటర్ల ఉత్సాహం కొనసాగింది. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. 2009 అసెంబ్లీ ఎన్నికల కంటే అధిక సంఖ్యలో ఓటర్లు ఈసారి […]పూర్తి వివరాలు ...