మా కడప జిల్లాలో వాడుకలో ఉండిన కొలతలు

    మా కడప జిల్లాలో వాడుకలో ఉండిన కొలతలు

    అలనాడు కడప జిల్లాలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆంగ్ల ప్రామాణిక కొలతల స్థానంలో స్థానికమైన ప్రత్యేకమైన కొలతలు వినియోగించేవారు. ఆర్ధిక సరళీకరణలు/ప్రపంచీకరణ మొదలయ్యే (1991 ) వరకు కూడా జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈ స్థానిక కొలతలు వినియోగంలో ఉండేవి. ప్రసార, ప్రచార మాధ్యమాల ఉధృతి కారణంగా మాండలిక సొబగులలో భాగమైన ఈ పదాలు (కొలతలు) కనుమరుగయ్యాయి. ఇప్పటికీ అక్కడక్కడా ముసలి వారు ఈ పదాలను ఉచ్చరించటం కన్పిస్తుంది.

    స్థానికత, కడప మాండలికం ఉట్టిపడే ఆ కొలతల పదబంధాలు వాటి వివరణలూ ఇవిగో…

    చదవండి :  గడ్డపార అనే పదానికి అర్థాలు, వివరణలు

    బరువుల కొలతలు:

    1 తులం = 11.2 గ్రాములు

    20 తులాలు = 1 సేరు

    6 సేర్లు = 1 పాంచ్ Ser

    12 సేర్లు = 1 దడియం

    4 ధడియాలు = 1 మండి (మనుము)

    ధాన్యం :

    2 కుంచములు = 1 ఇరిశ

    2 ఇరిశలు = 1 తూము

    5 తూములు = 1 ఎదుం

    2 ఎదుములు = 1 పందుం

    2 పండుములు = 1 పుట్టి

    చేతి కొలతలు:

    4 వేలెడు = 1 బెత్తెడు (నాలుగు వేళ్లు వెడల్పు మూసివేయబడింది)

    2 జానలు = 1 మూరెడు

    4 మూరలు = 1 బారెడు

    దూరాలు:

    1 పర్లాంగు = 2.5 మైళ్ళు

    4 పర్లాంగులు = 1 ఆమడ (10 మైళ్ళు)

    సమయం:

    60 విఘడియలు = 1 ఘడియ (24 నిముషాలు)

    చదవండి :  బీగం లేదా బీగము అనే పదానికి అర్థాలు, వివరణలు

    2 ఘడియలు = 1 ముహూర్తం

    7.5 ఘడియలు = 1 జాము (మూడు గంటలు)

    లోతు కొలతలు:

    1 మట్టు = 1 మనిషి యొక్క ఎత్తు

    1 కుంట = 1 మూర వెడల్పు మరియు లోతైన

    1 గుది = 3 అడుగులు లోతైన & 2 గజాల విస్తృత

    రోజులో సమయంను సూచించడానికి ఉపయోగించు పదాలు:

    6AM – 9AM – రేపిటాల/ యాకన్నీడి

    12PM – 2PM – పైటాల (అమ్మల(అంబల్ల) పొద్దు )

    2PM – 4PM – పెద్ద ఎసుల్ల పొద్దు

    చదవండి :  పారకోల లేదా పారకాల అనే పదానికి అర్థాలు, వివరణలు

    4PM – 6PM – చిన్న ఎసుల్ల పొద్దు

    సాయంకాలం నుండి సూర్యాస్తమయం వరకు – మాపి(యి)టాల (మాపిట జాము)

    సూర్యాస్తమయం నుండి 8PM వరకు – సందకాడ

    రాత్రి పొద్దు పోయాక – సయి(గి)ర పొద్దు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      1 Comment

      • Keka !! Chala precious info.

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *