వాటమైన కేటుగాడు (కవిత) – సొదుం శ్రీకాంత్

    వాటమైన కేటుగాడు (కవిత) – సొదుం శ్రీకాంత్

    నిధుల్లో వాటా సెప్పల్య
    నీళ్ళ కాడ కాటా బెట్టల్య
    ఉద్యోగాల్లో కోటా ముట్టల్య
    ఎముకలేని నాళికతో
    గాలిమేడల మాటల్తో
    నోటికాడ కూడు లూటీ సేసే
    వాటమైన కేటుగాడు ఈడు

    ఒరేయ్……….
    జూట్ కా బేటా
    నీ తాట ఒల్సి మెట్లుగుట్టుకోడానికి
    నా రాయలసీమ రాటు దేల్తాంది

    జిల్లాల వారీ ప్రణాళికలట
    గల్లీల్ని కూడా ఖిల్లాల్ని సేచ్చాడట
    కరువు సీమకు కన్నీళ్ళ సెరువులట
    కోయలకు నెత్తుటి పో’లవరాలట’
    పుకార్ల పోట్లంతో
    షికార్లు సేసి
    తల్లి వేరునే తెగనరికే
    టక్కర్ నా కొడుకు ఈడు

    చదవండి :  దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత)

    ఒరేయ్………
    కోస్తా కా బంటా
    నీ కార్పోరేట్ దొంగాట గుట్టువిప్పడానికి
    నా రాయలసీమ ముట్టుబెట్టే నిప్పుగుండం ఐతాంది.

    తుపాకీల నీడన
    తూటాల జాడన
    జెండా ఎగిరేసి ‘జైహింద్’ అని
    అదే సమగ్రాభివృద్దని, అధికార వికేంద్రీకరణ అని
    సంకలు గుద్ది
    సాటుగా జారుకునే
    జాదూ నాకొడుకు ఈడు

    ఒరేయ్…….
    వెన్నుపోటు ముఠాదారూ
    జెండా కర్రై నిన్ను యంటబడి ఏటాడి
    నీ గుండెలపై తెగబడ్డానికి నా సీమగడ్డ ఉవ్విళ్ళూరుతాంది.

    జై రాయలసీమ
    జై జై రాయలసీమ

    చదవండి :  సీమ రైతన్న (కవిత) - జగదీశ్ కెరె

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *