జిల్లాపైన ఆరోపణలు గుప్పించిన కలెక్టర్

కడప: “అన్ని జిల్లాల్లో ఉన్నట్లు ఇక్కడ పరిశ్రమలు లేవు, పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణం జిల్లాలో లేదు. పెట్టుబడి పెట్టేటప్పుడు పారిశ్రామిక వేత్తలు అనువైన పరిస్థితులను ఎంచుకుంటారు. భూములు ఇస్తామన్నా ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడి వారికి ఆవేశం ఎక్కువ అనే అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే భయపడుతున్నారు. అంతే తప్ప జిల్లాపై ఎలాంటి రాజకీయ వివక్ష లేదు. జిల్లాలో ఆస్పత్రుల ఏర్పాటు, తాగునీటి పథకాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు.” అని జిల్లా సర్వోన్నతాధికారి కెవి రమణ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేదికగా ఫక్తు రాజకీయనాయకుని మాదిరిగా ఆరోపణలు చేసినారు.

చదవండి :  ఔను...కడప జిల్లా అంటే అంతే మరి!

ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో సభాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…. అభివృద్ధి పరంగా జిల్లా వాసులు, నేతలు ఆలోచించుకోవాల్సి ఉందన్నారు. జిల్లాపై రాజకీయ వివక్ష ఉందంటున్నారని, అది సరికాదన్నారు. ముఖ్యమంత్రి పరిశ్రమల స్థాపనకు విదేశాలు తిరుగుతున్నారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రి ఏర్పాటులో రాజకీయలు, తాగునీటి టెండర్ వ్యవహారాల్లో రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఇవన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

చదవండి :  'ఉక్కు' నివేదిక ఏమైంది?

మహిళలు సమజానికి ఉపయోగపడడంతో పాటు వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవడం గర్వకారణమన్నారు. నేడు ఆడపిల్ల సంఖ్య తక్కువగా జిల్లాలో ఉండడం దురదుష్టకరమన్నారు. అందుకనే కేంద్రప్రభుత్వం స్ర్తిలకు అధిక ప్రాధాన్యత నిస్తూ బేటీబచావో-బేటీపడావ్ కార్యక్రమం అమలు చేసిందన్నారు.

మహిళలను గౌరవించాలని.. ఆలా జరిగిన చోట అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. పూర్వం ఉమ్మడి కుటుంబాలుండేవని.. ఆ కుటుంబాల్లో అనురాగం, ఆప్యాయతలుండేవని ఇప్పుడవన్నీ దూరమయ్యాయని జేసీ రామారావు అన్నారు. మహిళలకు కల్పించిన అవకాశాలు వారికి దక్కాలన్నారు.

చదవండి :  'సాహిత్య విమర్శ'లో రారాకు చోటు కల్పించని యోవేవి

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డీఆర్వో సులోచన మాట్లాడుతూ స్త్రీ, పురుషులిద్దరు కష్టపడితేకాని గడవని ఈ రోజుల్లో మహిళ రాత్రి 8 గంటల తరువాత బయట తిరిగితే అత్యాచారం చేస్తామంటే కుదరదన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో సేవలందించిన మహిళలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందచేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ రాఘవరావు, విజయాపౌండేషన్ ప్రతినిధి విశాలాక్షి, జిల్లా అధికారులు, బాలికలు, తదితరులు పాల్గొన్నారు.

కడప జిల్లాలో ఇంతటి అరాచక పరిస్తితులున్నట్లు భావిస్తున్న జిల్లా సర్వోన్నత అధికారి గారు వాటిని అదుపు చేయలేకపోతున్నారా? లేక ప్రభుత్వాన్ని సమర్ధించే ప్రయత్నంలో ఇబ్బంది పడుతున్నారా?

ఇదీ చదవండి!

jagan-ramachandraiah

విపక్ష నేతలూ… మా కోసం వస్తారు కదూ..!

అయ్యా.. విపక్ష నేతలూ! కడప జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య ఉపాధి కరువై, ప్రభుత్వ ఆదరువు లేక, రోగాల …

ఒక వ్యాఖ్య

  1. I think as per to statement of district collector, it shows that Kadapa is not suitable for improvement,or development,because of peoples of Kadapa. This means, the Gov is good and he himself is good, only people are bad.If it is the case then he is not suitable person to work as head of district.Please let him go somewhere which is suitable to him. I know, they some people who are aggressive and angry and they want to take revenge on Kadapa, because of RAJASHEKAR REDDY.Because of him they want to destroy the whole district.

    I realized that there is no future for KADAPA.I don not know to whom blame,may be the people of KADAPA, because they are not serious about their future and development.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: