కానీవయ్య అందుకేమి కడపరాయ

కానీవయ్య అందుకేమి కడపరాయ


సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శ్రీమాన్ శఠకోప యతీంద్రుల దగ్గిర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన అన్నమయ్య, భిన్న రూపాలలో కొలువై ఉన్న లక్ష్మీ సమేత శ్రీనివాసుని ముప్పది రెండు వేల సంకీర్తనతో కీర్తించిన పరమ భక్తుడు, భాగవతోత్తముడు. కడప బిడ్డడైన ఈ భాగవతోత్తముడు దేవుని కడపలో నెలవై ఉన్న లక్ష్మీసమేత వేంకట విభుని దర్శించి తరించినాడు. లక్ష్మీపతిని ‘కడపరాయ’నిగా వేనోళ్ళ కీర్తించిన అన్నమయ్య, ఆ కడపరాయని ప్రణయ గాధను ఇలా ఆలపిస్తున్నాడు…

చదవండి :  కడప జిల్లాలో రామాయణ రచనా పరిమళం

వర్గం: శృంగార సంకీర్తన
రేకు: 594-4
సంపుటము: 13-500
రాగము: శంకరాభరణం

కానీవయ్య అందుకేమి కడపరాయ – నేము
కానమా నీచేఁతలెల్లా కడపరాయా ॥పల్లవి॥

కప్పరపు నవ్వుల కడపరాయ-నాకు
గప్పవోయి పచ్చడము కడపరాయా
కప్పులు దేరీ నీ మోవిఁ గడపరాయ-యివి
కప్పముగా నెవ్వతిచ్చెఁగడపరాయ ॥కానీవయ్య॥

గరగరని వాఁడవు కడపరాయ-నాకు
గరఁగి వలవవోయి కడపరాయా
కరుణించి నన్నంటఁగాఁ గడపరాయ-నిన్ను
గరిసించే దెవ్వతోయి కడపరాయా ॥కానీవయ్య॥

కలువదండ నీకదె కడపరాయ-నన్ను
గలసితి వింతలోనే కడపరాయా
కలికి శ్రీవేంకటాద్రి కడపరాయ-నీకుఁ
గలదిఁక నెవ్వతోయి కడపరాయా ॥కానీవయ్య॥

చదవండి :  కాదనకు నామాట కడపరాయ - అన్నమయ్య సంకీర్తన


సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *