
కిడ్నాపైన కాంట్రాక్టర్ విడుదల
కడప: అసోంలో కిడ్నాపైన ఆంధ్రప్రదేశ్ సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వరరెడ్డి విడుదలయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అసోంలో కిడ్నాప్ చేసిన బోడో మిలిటెంట్లు ఆయనను పాట్నాలో విడుదల చేశారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మహేశ్వరరెడ్డి విడుదలయ్యారన్న విషయాన్ని మాదాపూర్ డీసీపీ కార్తీకేయ నిర్ధారించారు.
అసోంలోని దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో మహేశ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. మహేశ్వరరెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం.