కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు

ఈ కలెక్టర్ మాకొద్దు

కడప : జిల్లా ప్రజలపైన ఆరోపణలు గుప్పిస్తూ, జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారిన జిల్లా కలెక్టర్ ను గవర్నర్ వెంటనే వెనక్కి పిలిపించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో వివిధ రాజకీయపక్షాల నాయకులూ (తెదేపా మినహా), కార్యకర్తలూ, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలూ పాల్గొన్నారు.

ముందుగా కలెక్టరేట్ ఎదుట కూర్చుని నిరసన తెలిపిన అఖిలపక్షం ఆ తర్వాత కలెక్టరేట్ లోపలికి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురు మహిళలు, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులూ గాయపడ్డారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైఖరికి నిరసనగా ఆందోళన కారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతరం ముట్టడికి ప్రయత్నించిన శాసనసభ్యులను, ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి రిమ్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యేలను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు.

ఐదుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు, 10 మంది ఎస్‌ఐలు, వందల మంది పోలీసు సిబ్బంది కలెక్టరేట్ ప్రాంగణం లోపల ముళ్లకంచె ఏర్పాటు చేసి పహారా కాయడం విశేషం.

ఆందోళన సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగించారు.

ఆ అర్హత లేదు

కలెక్టర్ కేవీ రమణ చర్యలు గమనిస్తే జిల్లా అభివృద్ధిని అడ్డుకునేవిగా ఉన్నాయి. బద్వేలు సీఎస్‌ఐ చర్చి విషయంలో క్రైస్తవులపై చిన్నచూపు చూడటం ఏమాత్రం తగదు. కొంతమంది నాయకుల పనులు చేయడం మినహా జిల్లా ప్రజల సమస్యల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు ఇక్కడ పనిచేసే అర్హత ఇక ఏమాత్రం లేదు.

చదవండి :  ఆయన ఎవరో నాకు తెలియదు

 – దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి, కార్యదర్శి, జిల్లా రైతుసంఘం

కలెక్టర్ చర్యలు గర్హనీయం

బద్వేలు ఆసుపత్రి విషయంలో కలెక్టర్ చర్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ సీమాంక్ ఆస్పత్రికి డాక్టర్లను మార్చారు. అధికార పార్టీ నేతల మాటలు వింటూ చర్చి వాళ్లను వేధిస్తున్నారు. ఇంకా కలెక్టర్‌గా ఆయన కొనసాగడం సిగ్గుచేటు.

 – కె.జయశ్రీ, కన్వీనర్,మానవ హక్కుల వేదిక

అరెస్టులు అప్రజాస్వామికం

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సమస్యలపై ఆందోళనలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కలెక్టర్‌ను బదిలీ చేయాలంటూ అఖిలపక్షం నేతృత్వంలో ఆందోళన నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పూర్తిగా అప్రజాస్వామికం.

జిల్లాలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. బద్వేలులో బ్రిటీషు కాలంలో నిర్మించిన ఆస్పత్రిని అర్ధంతరంగా మార్చాల్సిన పని లేదు. ఇందువల్ల 28 గ్రామాల ప్రజలకు తీవ్ర అసౌకర్య పరిస్థితులు ఏర్పడతాయి. బద్వేలు మున్సిపల్ కౌన్సిల్ సైతం ఆస్పత్రిని మార్చరాదంటూ తీర్మానించినప్పటికీ కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. 13 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నారాయణ కళాశాల యాజమాన్యానికి అప్పగించడానికేనన్న గుసగుసలు ప్రజల్లో వినబడుతున్నాయి.

 – ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు

agitation against collector

కలెక్టర్‌ను వెళ్లగొడతాం

ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న జిల్లా కలెక్టర్ కేవీ రమణ వైఖరి సహించరానిది. జిల్లాలో పనిచేసే అర్హత ఆయనకు ఏమాత్రం లేదు. ఇలాంటి కలెక్టర్‌ను జిల్లా నుంచి వెళ్లగొట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తాము ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడబోము.

చదవండి :  కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న హరికిరణ్

 – జయరాములు, ఎమ్మెల్యే, బద్వేలు

కలెక్టర్ క్షమాపణ చెప్పాలి

బద్వేలు పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి, ఆస్పత్రి, దుకాణాల తొలగింపు విషయాల్లో జోక్యం చేసుకోనని, ఇప్పటిదాకా జరిగిన తప్పులపై కలెక్టర్ కేవీ రమణ క్షమాపణ చెబితే ఈ ఆందోళన విరమిస్తాం. లేదంటే ఆయన్ను జిల్లా నుంచి సాగనంపే వరకు పోరాడుతాం.

 – కె.ఆంజనేయులు,జిల్లా కార్యదర్శి, సీపీఎం

ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న కలెక్టర్

అవసరం లేని 15 చోట్ల ఇసుక రీచ్‌లకు అనుమతించడం ద్వారా అధికార పార్టీ నేతల దోపిడీకి కలెక్టర్ సహకరిస్తున్నారు. జిల్లా కరువుతో అల్లాడుతున్నా సహాయక చర్యల విషయం ఆయనకు పట్టదు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డికి సైతం ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం రోజు అవమానం జరగడానికి కలెక్టరే కారణం. ఆయన్ను జిల్లా నుంచి సాగనంపకపోతే ఊరుకోం.

 – ఆదినారాయణరెడ్డి,ఎమ్మెల్యే, జమ్మలమడుగు

సీఎస్‌తో విచారణ జరపాలి

కలెక్టర్ వ్యవహారాలపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో విచారణ జరిపించాలి. కలెక్టర్ రమణ క్రైస్తవ-ముస్లింల మధ్య తగువులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బూట్లతో చర్చిలోకి వెళ్లినందుకు అభ్యంతరం చెప్పిన వారిపై కక్షగట్టడం ఆయన స్థాయికి తగదు. ఒక విద్యార్థిని పట్ల అసభ్యంగా వ్యవహరించిన టీచర్‌ను వెనకేసుకు రావడం ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇలాంటి కలెక్టర్‌ను కొనసాగించడం ప్రభుత్వానికి తగదు.

చదవండి :  కడప జిల్లాపై బాబు వివక్ష: రామచంద్రయ్య

 – జి.ఈశ్వరయ్య,జిల్లా కార్యదర్శి, సీపీఐ

కలెక్టరే ఒక కరువు బండ

జిల్లా ప్రజలు తనకు ఓట్లు, సీట్లు ఇవ్వలేదని కక్షగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి ప్రజలను కాల్చుకు తినాలంటూ కలెక్టర్ కేవీ రమణను ఇక్కడికి పంపారు. జిల్లాలో నెలకొన్న కరువును కలెక్టర్ పట్టించుకోకపోవడం కాదు…కలెక్టరే ఒక కరువు బండ. గతంలో ప్రతి కలెక్టర్ జిల్లాకు ఎంతో కొంత మేలు చేశారు. దొడ్డిదారిన పదోన్నతి పొంది వచ్చిన కేవీ రమణ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. జిల్లా ప్రజల గురించి చెడుగా మాట్లాడటం ఆయనకు తగదు. బద్వేలు ఆస్పత్రిని మార్చవద్దని, అవసరమైతే ప్రసూతి ఆస్పత్రి కూడా అక్కడే పెట్టాలంటూ ప్రజలు కోరినా ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయకపోతే జిల్లా ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుంది.

 – రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు

కలెక్టర్‌ను రీకాల్ చేయాలి

సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణలపై ఇటీవల కొందరు జిల్లా అధికారులను కలెక్టర్ కేవీ రమణ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అధికార పార్టీలోని కొందరు నేతల పనులను తప్ప ప్రజల సమస్యలను  ఏమాత్రం పట్టించుకోని కలెక్టర్‌ను ప్రభుత్వం తక్షణమే రీకాల్ చేయాలి.

 – ఎస్‌ఏ సత్తార్, కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ

ఇదీ చదవండి!

కె.వి.సత్యనారాయణ

కె.వి.సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్నారు

కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కె.వి.సత్యనారాయణ బదిలీపై వెళుతున్న కలెక్టర్ కె.వి. రమణ నుంచి మంగళవారం బాధ్యతలు …

ఒక వ్యాఖ్య

  1. It is shame because such a big who is a head of district who has to sacrifice his life for his district, this same man doing his duty against will of peoples of KADAPA.This is shame, I think our Chief minister would be behind him, that is why he is doing like this way. Otherwise how he will get that much of courage to go against the peoples.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: