
కలెక్టర్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
మైదుకూరు: ప్రజా ప్రతినిధుల సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కెవీ రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి శుక్రవారం శాసనసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఆహ్వానించి, ఆపై పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రజాప్రతినిధులను అవమానపరిచారని ఈ నేపథ్యంలో సెక్షన్ 168 కింద విచారణకు స్వీకరించి చర్యలు చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు.