జిల్లాలో 48 కరువు మండలాలు
కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, బ్రహ్మంగారిమఠం, రాజంపేట, ఖాజీపేట, వీరపునాయునిపల్లె, బి.కోడూరు, పోరుమామిళ్ల, చింతకొమ్మదిన్నె, కలశపాడు, చిట్వేలి, మైదుకూరు, పెద్దముడియం, వేముల, వల్లూరు, రాజుపాళెం, కమలాపురం, కాశినాయన, లింగాల, సంబేపల్లె, ప్రొద్దుటూరు, ఒంటిమిట్ట, దువ్వూరు, నందలూరు, ముద్దనూరు, సుండుపల్లె, ఎర్రగుంట్ల, సిద్ధవటం, చాపాడు, కొండాపురం, పెండ్లిమర్రి, మైలవరం కరవు ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది.
మొత్తానికి కడప జిల్లాను కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కరువు సహాయక చర్యలను గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదెందుకో? కరువు బారిన ఈ మండలాలకు ప్రభుత్వం తక్షణ సాయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది.
1 Comment
కరువు లేని/ప్రకటించని మండలాలు మూడన్నమాట (చెన్నూరు, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లె).