
కమలాపురంలో ఎవరికెన్ని ఓట్లు?
కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం 15 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలుచున్నారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన పోచంపల్లి రవీంద్రనాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, తెదేపా – భాజపా ల ఉమ్మడి అభ్యర్థీ అయిన పుత్తా నరసింహారెడ్డి పై సుమారు ఐదు వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
తుదిపోరులో తలపడిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు …
పి రవీంద్రనాద్ రెడ్డి – వైకాపా – 78547
పుత్తా నరసింహారెడ్డి – తెదేపా – 73202
ఇంజా సోమశేఖర్ రెడ్డి – కాంగ్రెస్ – 1395
మాచుపల్లి వెంకట సుబ్బారెడ్డి – నేకాపా – 1151
పాలెంపల్లి జయసుబ్బారెడ్డి – జెడిఎస్ – 913
జి మోహన్ బాబు – జెడియు – 321
ఎం శ్రీనివాసులరెడ్డి – ఆరేల్డీ – 285
ఎస్ అమర్నాద్ రెడ్డి – జైసపా – 270
నర్రెడ్డి కిశోర్ కుమార్ రెడ్డి – ఫార్వర్డ్ బ్లాక్ – 146
ఎస్ చిన్న అంకి రెడ్డి – రాజ్యాధికార పార్టీ – 122
ఎస్ శివశంకర్ రెడ్డి – లోక జనశక్తి – 106
ఆర్వీ నారాయణరెడ్డి – దళిత బహుజన పార్టీ – 157
పిఎన్ రామాంజులరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి – 153
కొర్రపాటి ప్రవీణ్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి – 261
ఎస్ శ్రీనివాసరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి – 208
నోటా – 567