
కమలాపురం ఉరుసు గోడపత్రం
ఈ రోజు నుంచి కమలాపురం ఉరుసు
హిందూ, ముస్లింల సమైక్యత ప్రతీక కమలాపురం శ్రీహజరత్ అబ్దుల్ గఫార్‌షా ఖాద్రి, దస్తగిరి ఖాద్రి, మౌలానామౌల్వి ఖాద్రి, మొహిద్దీన్‌షా ఖాద్రి, జహిరుద్దీన్‌షాఖాద్రి దర్గా . నేటికీ ఇక్కడ హిందువులే ధర్మకర్తలు.

దర్గాను దస్తగిరిషా ఖాద్రి శిష్యుడు, పొద్దుటూరుకు చెందిన నామా నాగయ్య శ్రేష్ఠి నిర్మించారు. నేటివరకూ వారి కుటుంబికులే ధర్మకర్తలుగా సేవలందిస్తున్నారు. హజరత్ అబ్దుల్‌గఫార్‌షా ఖాద్రి ఉరుసు సోమవారం ఉరుసు ప్రారంభమై 17న ముగుస్తుంది.
14వ తేదీ నషాన్
15న గంధం,
16న ఉరుసు,
17న తహలీల్‌తో ఉరుసు ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు.
గంధం, ఉరుసు సందర్భంగా రెండు రోజులూ రాత్రి ఢిల్లీకి చెందిన నిజామి సోదరులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమిల్ ఆరిఫ్ సాబరీ కళాకారుల ఖవ్వాలీ పోటీలు ఏర్పాటు చేశారు.
బండలాగుడు పోటీలు
16న పాలదంతాల ఎద్దులకు చిన్నబండ లాగుడు పోటీలు నిర్వహిస్తారు. గెలుపొందిన గిత్తలకు ప్రథమ బహుమతి రూ.25,116లను, ద్వితీయ బహుమతి రూ.10వేలు, మూడో బహుమతి రూ.5 వేలు ప్రదానం చేస్తారు.