'ఈ రోజు' జిల్లాకు ప్రభుత్వ హామీలపై ఓ పత్రిక ప్రచురించిన కథనం

ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం:

1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా సంస్థలేవీ కడప జిల్లా ఛాయలకు రాకుండా చేశారు. కానీ కేవలం 11 పరిశ్రమలున్న కడప జిల్లాలో(Src:www.apind.gov.in/library/district/kadapa.pdf) పన్నెండో పరిశ్రమ నిర్మిస్తున్నందుకే ఇంకేమీ లేకుండా చేస్తూ, అదే చేత్తో నూటికి పైగా భారీ/మధ్య తరహా పరిశ్రమలున్న (http://www.apind.gov.in/library/district/chittoor.pdf) చిత్తూరు జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటుచెయ్యాలి. ఏడెనిమిది విశ్వవిద్యాలయాలున్న అదే జిల్లాలో అదనంగా ఒక ఐ.ఐ.టి., ఒక ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్.ఏర్పాటుచెయ్యడమే సమన్యాయం. స్టీల్ ప్లాంటు ఒక్కటీ కడప జిల్లాలో కడుతున్నారు కాబట్టి ఇలాంటి విద్యాసంస్థల్లో ఒక్కటి కూడా కడప జిల్లావాసులు ఆశించకూడదు. ఇది స్వయంగా ఐ.టి. శాఖామంత్రి పల్లె రఘునాథరెడ్డి కడపలో ఇచ్చిన ప్రవచనం. కోరికలను చంపుకుని వైరాగ్యం పెంచుకోండయ్యా!!

2. సిమెంట్ పరిశ్రమలు: ఇప్పుడున్న పరిశ్రమలకు అదనంగా కనీసం 3 పరిశ్రమలు ఈ ప్రభుత్వం ఏర్పడకముందే అనుమతులన్నీ తెచ్చుకుని త్వరలో మొదలవబోతున్నాయి. ఆ ప్రైవేటు పరిశ్రమలను కూడా చంద్రబాబు నాయుడి “అఛీవ్‌మెంట్స్” ఖాతాలో వేస్తారా ఏమిటి ఖర్మ?

3. ఖనిజాల ఆధారిత పరిశ్రమలు: జిల్లాలో ఏయే ఖనిజాలున్నాయో, వాటి ఆధారంగా ఏయే పరిశ్రమలు నెలకొల్పాలో కూడా తెలియని అయోమయ వాగ్దానం. గట్టిగా మాట్లాడితే “పైన చెప్పిన స్టీలు, సిమెంటు ఫాక్టరీలు ఖనిజాధారితాలే కదా? మీ మొహాలకు ఇంకా ఏం కావాలి?” అని దబాయించగలరు.

చదవండి :  కడప జిల్లా ముఖచిత్రమే మారిపోతుందా!

4. పారిశ్రామిక స్మార్ట్ సిటీ: అంటే ఏమిటి? కడప, ప్రొద్దటూరు పారిశ్రామిక నగరాలైతే కాదు. సిమెంటు పరిశ్రమలున్న ఎర్రగుంట్లా? లేక స్టీల్ ప్లాంటుకు అనుబంధంగా ఏర్పడబోయే టౌన్ షిప్పునే స్మార్ట్ సిటీ అనుకొమ్మంటారా?

5. కడప ఎయిర్‌పోర్టును వాడుకలోకి తేవడం: అంటే ఏమిటి? రిబ్బను కత్తిరించి చప్పట్లు కొట్టించుకోవడమేనా? కడప విమానాశ్రయం యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలోనే రిమోట్ అయిర్ కనెక్టివిటీలో భాగంగా ప్రత్యేకంగా ఎంపికచేయబడి, అభివృద్ధి చేయబడింది. దాన్ని కొత్తగా ఉద్ధరించేదేమిటి?

6. ఫుడ్ పార్క్: అంటే ఏమిటి? ఎక్కడ? ఎలా?

7. ఉర్దూ విశ్వవిద్యాలయం: ఇది మాజీ మంత్రి రహంతుల్లా ఉర్దూ, ముస్లిం వ్యవహారాల శాఖా మంత్రిగా ఉండి ప్రతిపాదించి, కోరుకున్నది. ఇప్పుడిస్తున్నారు. శుభం.

8. సోలార్ పవర్ మరియు విండ్ పవర్: సోలార్ ప్లాంట్లు కొన్ని నిర్మాణదశలో ఉన్నాయి. విండ్ పవర్ సంగతేమిటో చూడాలి.

9.గార్మెంట్ క్లస్టర్: (ప్రొద్దటూరు, మాధవరంలలో) టెక్స్‌టైల్ పార్కులు పోయి (ఎక్కడో తెలియని) గార్మెంట్ క్లస్టర్ వచ్చె ఢాం ఢాం ఢాం

medicalఅనంతపురం వైద్యకళాశాల, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఒక్కొక్కదాన్ని 150 కోట్ల ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మారుస్తామని ప్రకటించి (జోడించిన Medical.png అన్న వార్త చూడండి), ఇప్పుడు అదే విజయవాడ సమీపంలో ఎయిమ్స్, అదే అనంతపురంలో ఎయిమ్స్ అనుబంధకేంద్రాన్ని నెలకొల్పుతారా? ఇతర ప్రాంతాలవాళ్ళకు రోగాలు రావా? వాళ్లకు వైద్యసేవలు అవసరం లేదా?

చదవండి :  ఎర్రగుంట్ల కౌన్సిలర్లపై అనర్హత వేటు

పేదసాదలకు ఉపయోగపడవలసిన వైద్య సంస్థ విషయంలోనైనా కనీస ఇంగితజ్ఞానం ఉపయోగించనక్ఖర్లేదా?
కడప జిల్లా పేపర్లో ఏరోజు చూసినా ప్రాణమ్మీదికి వచ్చిన రోగులు తిరుపతికో కర్నూలుకో తరలిస్తూండగా దారిలోనే ప్రాణాలు వదిలారన్నది తరచూ కనిపించే వార్త. పేర్లు మారుతాయిగానీ సారాంశం ఒక్కటే. ఆ వార్తలు చదివినప్పుడల్లా కడుపు రగిలిపోతుంది. ప్రాణాల మీదికి వచ్చినప్పుడే కాక ఇతర వైద్యావసరాల విషయంలో కూడా పేషెంటు వైపు నుంచి ఆలోచించినట్లైతే – 200 కి.మీ. వరకు ప్రయాణం చెయ్యడానికి బస్సులో సాధారణంగా నాలుగైదు గంటలు పడుతుంది. పొద్దున్నే బయలుదేరితే ఆస్పత్రిలో చూపించుకుని రాత్రికి ఇల్లు చేరడానికి సరిపోయే గరిష్ఠదూరం 200 కిలోమీటర్లు. ఆస్పత్రిలో డాక్టర్లు వైద్యపరీక్షలు రాసిచ్చి, ఫలితాలతో మరుసటిరోజు రమ్మనడం సర్వసాధారణం. అలాంటప్పుడు ఆ రాత్రికి స్వగ్రామానికి వెళ్ళిరావాలనుకునే పేషెంట్లకు ప్రయాణదూరం 200 కి.మీ. మించకుండా ఉంటేనే అనుకూలం. లేనట్లైతే పేషెంటు, తోడుగా వచ్చిన అటెండెంటు ఆ రాత్రికి తప్పనిసరిగా ఆస్పత్రి సమీపంలో బసచేయాల్సి ఉంటుంది. అదొక అదనపు ఖర్చు కాగా, ఇంటిదగ్గర అత్యవసరమైన పనులేవైనా ఉన్నా, డబ్బు సర్దుబాటు చేసుకురావాలన్నా వీలుపడని పరిస్థితి. ఇవన్నీ అధికసంఖ్యాకులైన అల్పాదాయవర్గాలకు చెందిన సగటు పేషెంట్లు పడే బాధలు. ఇన్-పేషెంటైతే అదొక లెక్క. అలా కాక కొన్ని వారాలపాటు రోజూ డాక్టరు దగ్గర చూపించుకోవలసిన పేషేంట్లు వేలూరు CMC లాంటిచోట్లైతే కొన్ని వందల మంది ఉంటారు. వీళ్ళలో చాలా మంది చెట్ల కింద, లేదా దగ్గర్లోని లాడ్జిలలో ఒక్కోసారి నెలల తరబడి ఉండిపోవలసి వస్తుంది.

చదవండి :  అధికారిని తిట్టిన తెదేపా నేత లింగారెడ్డి

locationకోస్తాంధ్రలో విశాఖపట్నంలోని కె.జి. హాస్పిటల్ మొదలుకుని గుంటూరు మెడికల్ కాలేజీ వరకు, నాణ్యమైన వైద్యసేవలందించే ప్రభుత్వ మరియు ప్రైవేటు అస్పత్రులు చాలానే ఉన్నాయి. రాయలసీమలో ఆ మూలనున్న తిరుపతి, ఈ మూలనున్న కర్నూలు తప్ప ఇతర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ వైద్యసంస్థలే లేవు. సామీప్యత దృష్ట్యా కడపనుంచి ఎటువైపు చూసినా 200 కి.మీ. వరకు స్వరాష్ట్రంలోని జనావాసాలే ఉండగా AIIMS కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గుంటూరు-మంగళగిరి నుంచి రెండు దిక్కుల్లో మాత్రమే ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రాంతాలు, ఒక వైపు సముద్రం, ఇంకోవైపు పొరుగురాష్ట్రాలు ఉన్నాయి (జోడించిన మ్యాపు KG.png చూడండి). తెలంగాణవాసులకు సైతం వైద్యసేవలందించడానికి మనం సిద్ధంగా ఉన్నా, ఆ రాష్ట్రంలో మెడికల్ హబ్ గా అవతరించిన హైదరాబాదు, అదనంగా ఇంకో AIIMS రానుండడం వల్ల ప్రతిపాదిత AIIMS (ఆం.ప్ర.) పరిధి మరీ కుంచించుకుపోయి, తెలుగువారిలో అధిక సంఖ్యాకులకు అది దూరంగానే ఉండిపోతుంది. కడపలో నిర్మించినట్లైతే అరకొర వైద్యసౌకర్యాలకు పరిమితమైన ఆరు జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కానీ కబోది ప్రభుత్వాలు ఆ దృష్టితో ఆలోచించవు. అది మన ప్రారబ్దం.

కాపురం చేసే కళ కాలుతొక్కినప్పుడే తెలిసింది – “రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలు, జిల్లాలను ప్రగతి పథంలో పయనింపచేయడం” – బహుగొప్పగా మొదలైందని.

– త్రివిక్రమ్

(g.trivikram@gmail.com)

ఇదీ చదవండి!

కడప జిల్లాలో నేరాలు

కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన

రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో …

6 వ్యాఖ్యలు

 1. త్రివిక్రమ్

  The Hindu gives a complete list of projects worth mentioning: http://www.thehindu.com/news/national/andhra-pradesh/naidu-unveils-grandiose-plans-for-all-districts/article6380453.ece

  Of them, not a single project is in YSR District apart from the Steel Plant (which was already promised in the State Reorganisation Act).

 2. దివాలాకోరు నాయకులుంటే డబ్బు మదంతో అధికార మత్తులో తేలియాడే దగాకోరులు ఇట్టానే మోసం సేచ్చారు. మనం నిద్ర లేసి అడగకపోతే ఇంక అంతే సంగతులు – మనల్నే తాకట్టు పెడతారు వీళ్ళు.

  • Please highlight what YSR did to neighboring Nellore Dt.
   YSR was a selfish man. He has provided three Govt. Engineering colleges in his own district –
   1) IIIT IDPULAPAYA,
   3) YSR YOGI VEMANA ENG. COLLAGE Proddutur
   3) JNTU Pulivendula.
   He has diverted most of the state resources to his district. Not cared to provide at least one Engineering college in the neighbouring Nellore Dt.

   • Ayya! TR Babu gaaru, Nellure abivruddi jillagaa namodinaa vishayam telusukondi. No. of educational institure unna nellure ku evikudaa emmantaraa. Janardhan reddy gaaru chesina paripalanalo jariginaa nayam kudaa chappandi. YSR selfinsh eyte ee roju Adillabaad nundi Chittur varaku Sreekakulam nundi Anatapur varaku YSR nu devudi rupam lo chustaru. Ayana asemblilone chappadu 55 years andra rastramlo oka chinna abhivruddi chesinaa paapana poledu kadapaku, nenu chesindi amiledu eyte naa kanna talli runam nenu enchesina tirchukolenani. Dochi donga chatugaa daachi pette rakham kaadu YSR di. Ayanaa emchadante…anni prantalaku balanced development andinchadu. Adi mi kanti kanabadaledante adi mi drusti lopam.

 3. త్రివిక్రమ్

  ఆగస్టు పదహైదు నాడు ముఖ్యమంత్రి కర్నూలు వాసులకు ధారాళంగా ఇచ్చిన వాగ్దానాల్లో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని కర్నూల్లో నెలకొల్పుతామన్నది ఒకటి (http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/cm-showers-sops-on-kurnool/article6322932.ece మూడో పేరాలో మూడో లైను, http://www.thehindu.com/news/national/andhra-pradesh/debate-over-naidus-promises-made-to-kurnool/article6350953.ece మూడో పేరాలో నాలుగో లైను). నెల రోజులకే రాజధాని ప్రకటించేనాటికి దాన్ని కర్నూల్లో కాకుండా కడపలో నెలకొల్పుతామని మాట మార్చేశారు. ఇంకా ఏయే విషయాల్లో ఎన్నిసార్లు మాటమారుస్తారో!

 4. చెంద్రబాబు మొదిట్నుంచీ ఇంతే.. కడపంటే ఆయప్పకు మంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: