
కడపలో ఏఆర్ రెహ్మాన్
కడప: పెద్దదర్గాలో శుక్రవారం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ అమీన్‌పీర్ సాహెబ్ చిష్ఠివుల్ ఖాద్రీ ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
పెద్ద ఉరుసు ఉత్సవాన్ని తలపిస్తూ భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ఇందులో భాగంగా దర్గాలోని హజరత్ అమీన్‌పీర్ సాహెబ్ మజార్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తులు మజార్‌ను దర్శించుకుని పూలచాదర్ సమర్పించి ఫాతెహా నిర్వహించారు. దర్గాలో రాత్రి ఖవ్వాలీ నిర్వహించారు.
ఏఆర్ రెహ్మాన్ ప్రార్థనలు
శుక్రవారం ఉదయం 2 గంటలకు దర్గాలో జరిగిన ఉత్సవానికి సినీ సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఆయన పీఠాధిపతి స్వయంగా తెచ్చిన గంధాన్ని మజార్‌వద్ద సమర్పించారు.