కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన పార్టీల వివరాలు. ఆయా అభ్యర్థులు సాధించిన మెజార్టీ వివరాలు …
నియోజకవర్గం | గెలుపు | మెజార్టీ |
---|---|---|
కడప | అంజద్ బాషా (వైకాపా) | 44,245 |
పులివెందుల | వైఎస్ జగన్ (వైకాపా) | 75,243 |
జమ్మలమడుగు | సి ఆదినారాయణ రెడ్డి (వైకాపా) | 12,167 |
ప్రొద్దుటూరు | రాచమల్లు ప్రసాద్ రెడ్డి (వైకాపా) | 13,025 |
మైదుకూరు | శెట్టిపల్లి రఘురామిరెడ్డి (వైకాపా) | 11,386 |
బద్వేలు | టి జయరాములు (వైకాపా) | 9,561 |
కమలాపురం | పి రవీంద్రనాద్ రెడ్డి (వైకాపా) | 5,345 |
రాజంపేట | మేడా మల్లిఖార్జున రెడ్డి (తెదేపా) | 11,000 |
రైల్వే కోడూరు | కొరముట్ల శ్రీనివాసులు (వైకాపా) | 19,072 |
రాయచోటి | గడికోట శ్రీకాంత్ రెడ్డి (వైకాపా) | 34,738 |
కడప పార్లమెంటు | వైఎస్ అవినాష్ రెడ్డ్డి(వైకాపా) | 1,90,265 |
రాజంపేట పార్లమెంటు | పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (వైకాపా) | 1,76,867 |