రెండు రోజులు కాదు వారానికి మూడు రోజులు
కడప – బెంగుళూరు ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు
కడప: కడప -బెంగుళూరుల మధ్య ప్రారంభం కానున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు వారంలో మూడు సార్లు నడవనుంది. ప్రతి ఆది, బుధ, గురు వారాలలో బెంగుళూరు – కడపల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుంది.
ఉదయం 10.40 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరే విమానం 11.30 గంటలకు కడపకు చేరుకుంటుందని, తిరిగి అదే విమానం కడప నుంచి 11.50 గంటలకు బయలుదేరి 12.35 గంటలకు బెంగళూరు చేరుతంది ఎయిర్ పెగాసస్ సంస్థ ఒక ప్రకటనలో తెలియచేసింది. కడప – బెంగుళూరు విమానానికి ముందస్తుగా కొనేవారికి టికెట్ రూ.1234కు దొరుకుతుంది.
1 Comment
I love my kadapa i wait for channia to kadapa when start