కడప పెద్దదర్గాలో ‘అల్లరి’ నరేష్

కడప పెద్దదర్గాలో ‘అల్లరి’ నరేష్

కడప: కథానాయకుడు ‘అల్లరి’ నరేష్ ఈ రోజు (ఆదివారం) కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు. నరేష్ పూల చాదర్‌లను దర్గాలోని ప్రధాన గురువుల మజార్ల వద్ద సమర్పించి ప్రార్థనలు చేశారు.

అల్లరి నరేష్అనంతరం నరేష్ విలేఖరులతో మాట్లాడుతూ.. చాలా కాలం నుంచి పెద్ద దర్గాకు రావాలని ప్రయత్నించినా వీలు కాలేదన్నారు. ప్రస్తుతం తాను నటించిన ‘జేమ్స్‌బాండ్’ సినిమా విజయవంతం కావడంతో దర్గా గురువుల ఆశీస్సుల కోసం వచ్చానన్నారు.

జేమ్స్‌బాండ్‌చిత్రంలో ‘సీమ’ సంప్రదాయాన్ని కించపరిచిన సందర్భాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా హాస్యం కోసం సన్నివేశం డిమాండును బట్టి అలా చేశామే గానీ సీమ ప్రాంతాన్ని కించపరచాలని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు.

చదవండి :  కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ -1

సీమశాస్త్రి, సీమ టపాకాయ్ సినిమాలను ‘సీమ’ సంప్రదాయానికి అనుగుణంగానే తీశామన్నారు. తన సినిమాలను అన్ని ప్రాంతాల వారి కోసం తీస్తామని అందువల్ల ఏ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తమకు ఉండదన్నారు. అల్లరి నరేశ్ తో పాటు హాస్యనటుడు రఘు తదితరులు కూడా దర్గాను సందర్శించుకున్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: