మంగళవారం , 17 సెప్టెంబర్ 2024

భాజపాలో చేరిన కందుల సోదరులు

కడప: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో జిల్లాకు చెందిన కందుల సోదరులు ఆదివారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నగరంలోని పురపాలిక మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోకందుల శివానంద రెడ్డి మాట్లాడుతూ…విభజన వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందన్నారు.  విభజన హామీలను   సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.

వైఎస్సార్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  జిల్లాలో ఉక్కు  కర్మాగారం వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.  రాయలసీమ అభివృద్ధి  భారతీయ జనతాపార్టీతోనే సాధ్యమనే భావనతోనే తాము ఆ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. కందుల రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించి బీజేపీలో చేరుతున్నామన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని బీజేపీ సారధ్యంలో త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.

చదవండి :  నాలుగోసారి పార్టీ మారనున్న కందుల సోదరులు

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో కందుల సోదరులు  శివానందరెడ్డి, రాజమోహన్‌రెడ్డి, శివానందరెడ్డి తనయుడు చంద్ర ఓబుల్‌రెడ్డి (నాని) తదితరులతోపాటు మాజీమంత్రి సరస్వతమ్మ, మైదుకూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మిపార్వతి, రైల్వేకోడూరుకు చెందిన పారిశ్రామికవేత్త గల్లా శ్రీనివాస్, కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, లేవాకు మధుసూదనరెడ్డి, సమరనాథరెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వెంకయ్యనాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి!

ఎన్నికల షెడ్యూల్ - 2019

కడప జిల్లాలో ప్రధాన పార్టీల శాసనసభ అభ్యర్థులు

కడప జిల్లాలో మొత్తం పది శాసనభ నియోజకవర్గాలున్నాయి. ఈ పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైకాపా, కాంగ్రెస్, తెదేపా+భాజపా మరియు …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: