వైకాపా గూటికి చేరిన కందుల సోదరులు

    వైకాపా గూటికి చేరిన కందుల సోదరులు

    కందుల శివానంద రెడ్డి, అతని సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమోహన రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు. వీరు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే అభ్యర్ధి అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల సోదరులు మాట్లాడుతూ జిల్లా అభివృద్ది కోసమే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా వైకాపాలో చేరినట్లు చెప్పారు.

    చదవండి :  వైకాపా చతికిలపడిందా?

    మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న కందుల సోదరులు సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కొద్ది కాలం ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మల్లీ కొద్ది కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత నెలలోనే మళ్లీ టిడిపిలో చేరారు. అయితే అక్కడ కడప లోక్సభ టికెట్ ఆశించి భంగపడ్డ కందుల బ్రదర్స్ మొత్తానికి వైకాపా గూటికి చేరారు.

    కందుల శివానందరెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.1981 నుంచి 1986 వరకు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు.1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున కడప శాసనసభ స్థానంకు పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత కూడా ఆయన మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 1996లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులుగా పనిచేశారు. ఆయన సోదరుడు కందుల రాజమోహన్‌రెడ్డి కూడా పోలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు. కందుల రాజమోహన రెడ్డి మూడు సార్లు లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2011లో ఉప ఎన్నికల సందర్భంగా కందుల సోదరులిద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

    చదవండి :  వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్

    కందుల బ్రదర్స్ తో పాటు తెదేపా తరపున ఎమ్మెల్సీగా పనిచేసిన వెంకటస్వామిరెడ్డి, జిల్లా గ్రంధాలయాల సంస్థ చైర్మన్ రామకోటిరెడ్డి మొదలైన వారు కూడా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.

    వైఎస్ పై సుదీర్ఘ కాలం జిల్లాలో పోటీగా నిలబడిన కందుల బ్రదర్స్ చివరకు వైఎస్ కుమారుడు స్థాపించిన పార్టీలో చేరటం విశేషమే!

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *