ఏమే రంగన పిల్లా – జానపదగీతం

ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన మగడిని చూసి అలిగింది ఆ అందాలభామ. ఆ మగడు ఆమెను ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో చూడండి.

వర్గం: జట్టిజాం పాట (బృందగేయం)

పాడటానికి అనువైన రాగం:తిలకామోద్ స్వరాలు (మధ్యాది తాళం)

ఏమే రంగన పిల్లా
నీ మకమే సిన్నబాయ – సెప్పే పిల్లా

చదవండి :  కదిరి చిన్నదానా .... జానపదగీతం

ఆలూరు సంతాకు పోతాన్ పిల్లా
అడిగినన్ని సొమ్మూలు తెత్తాన్ పిల్లా
నీ కిత్తాన్ పిల్లా నేనోత్తాన్ పిల్లా ||ఏమే||

పులెందుల సంతాకు పోతాన్ పిల్లా
పూవుల దండలెన్నో తెత్తాన్ పిల్లా
నీ కిత్తాన్ పిల్లా నేనోత్తాన్ పిల్లా ||ఏమే||

కర్నూలు సంతాకు పోతాన్ పిల్లా
కమ్మాలు కడియాలు తెత్తాన్ పిల్లా
నీ కిత్తాన్ పిల్లా నేనోత్తాన్ పిల్లా ||ఏమే||

పత్తికొండ సంతాకు పోతాన్ పిల్లా
నీకు పచ్చికొబ్బెర బెల్లాము తెత్తాన్ పిల్లా
నీ కిత్తాన్ పిల్లా నేనోత్తాన్ పిల్లా ||ఏమే||

చదవండి :  తుమ్మెదలున్నయేమిరా ... జానపద గీతం

పాటను సేకరించిన వారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య

ఇదీ చదవండి!

శివశివ మూరితివి

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: