
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ – 2019
ఓట్ల సందడి మొదులైంది
లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశే్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలతో పాటు శాసనసభకు కూడా ఒకే రోజు ఎన్నికల షెడ్యూలు ఈసీ ప్రకటించింది.
నోటిఫికేషన్ జారీ : 18 మార్చి
నామినేషన్ల స్వీకరణ : 18 మార్చి – 25 మార్చి
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 28 మార్చి
పోలింగ్ : 11 ఏప్రిల్
కౌంటింగ్ మరియు ఫలితాలు : మే 23