
నెలాఖరు వరకు ఉపకారవేతనాల దరఖాస్తుకు గడువు
కడప: 2014 -15 విద్యా సంవత్సరం కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులు ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ జూనియరు డిగ్రీ కళాశాలలు, వృత్తివిద్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తునకు అర్హులన్నారు.
అర్హులైన విద్యార్థులు https://apepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషను చేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2లక్షల లోపున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉన్న బీసీ, ఈబీసీ వికలాంగులు, మైనార్టీ విద్యార్థులు ఉపకారవేతనాలకు అర్హులని పేర్కొన్నారు.